ETV Bharat / entertainment

'ఇది మా ఫ్యామిలీకి బ్యాడ్ డే!'- కరీనా కపూర్​ - KAREENA KAPOOR

సైఫ్ అలీ ఖాన్​ దాడిపై ఆయన భార్య స్పందన- సోషల్ మీడియాలో పోస్ట్

Kareena Kapoor
Kareena Kapoor (Source : ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 16, 2025, 10:55 PM IST

Saif Ali Khan Attack : బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్​పై గురువారం జరిగిన ఎటాక్​ బీ టౌన్​ను కుదిపేసింది. ఓ దుండగుడు సైఫ్​పై కత్తితో దాడి చేశాడు. కత్తిపోట్లకు గురైన సైఫ్‌ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనిపై ఆయన సతీమణి కరీనా కపూర్​ స్పందించారు. తమ కుటుంబానికి ఇది కఠినమైన రోజు అని, ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు.

'మా కుటుంబానికి ఇది ఎంతో సవాలుతో కూడుకున్న రోజు. ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కఠినమైన సమయంలో మద్దతుగా నిలిచినవారందరికి కృతజ్ఞతలు. మీడియా, ఫ్రీలాన్సర్లు కాస్త సంయమనం పాటించాలని, ఊహాజనిత కథనాలు, కవరేజీకి దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నా. మా పై చూపిస్తున్న అభిమానాన్ని గౌరవిస్తున్నప్పటికీ, ఇటువంటి చర్యలు మా భద్రతను మరింత ప్రమాదంలో పడేసే అవకాశం ఉంది. ఈ ఘటన నుంచి తేరుకునేందుకు వీలుగా మా కుటుంబానికి కొంత వ్యక్తిగత సమయం ఇవ్వాలని అభ్యర్థిస్తున్నా' అని సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశారు.

ఇదీ జరిగింది
కాగా, గురువారం తెల్లవారుజామున 2.30 గంటలకు దాడి జరిగింది. సైఫ్, అతడి కుటుంబసభ్యులు నిద్రలో ఉండగా, ఇంట్లోకి చొరబడిన దుండగుడు చోరీకి యత్నించాడు. సైఫ్‌ అడ్డుకునేందుకు ప్రయత్నించగా దాడి చేసి పరారైనట్లు తెలుస్తోంది. కత్తిపోట్లకు గురైన ఆయనకు లీలావతి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు ఈ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

చిరు, ఎన్టీఆర్ విచారం
ఈ ఘటనపై మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ విచారం వ్యక్తం చేశారు. దాడి విషయం తెలిసి తాము షాకయ్యామని అన్నారు. 'సైఫ్‌ అలీఖాన్‌పై దాడి నన్ను ఎంతగానో కలచివేసింది. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా' అని చిరంజీవి పోస్ట్‌ పెట్టారు. 'సైఫ్‌ సర్‌పై దాడి గురించి తెలిసి షాకయ్యా. ఇది నిజంగా బాధాకరం. ఆయన త్వరితగతిన కోలుకోవాలని క్షేమంగా తిరిగిరావాలని కోరుకుంటున్నా' అని ఎన్టీఆర్‌ పేర్కొన్నారు. మరోవైపు అభిమానులు సైఫ్‌ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ పోస్టులు పెడుతున్నారు.

సైఫ్​పై దాడి చేసిన నిందితుడి ఫొటో రిలీజ్‌- అత్యవసర మెట్ల మార్గం నుంచి ఇంట్లోకి!

సైఫ్ ఈజ్ సేఫ్​- వెన్నెముక నుంచి కత్తిని తొలగించాం: వైద్యులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.