Horoscope Today January 17th 2025 : 2025 జనవరి 17వ తేదీ (శుక్రవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) : మేష రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పట్టుదలతో పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తారు. కీలకమైన విషయాల్లో వ్యూహాత్మకంగా ముందుకు నడిస్తే విజయం ఉంటుంది. కుటుంబంతో మంచి సమయాన్ని గడుపుతారు. ఆర్ధిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోండి. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.
వృషభం (Taurus) : వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అనుకున్నది సాధించే వరకు విశ్రమించరు. మీ పనితీరుతో ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు. శుభకార్యాల్లో పాల్గొని బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోకండి. అనవసర వివాదాలలో తలదూర్చవద్దు. ఆర్ధికంగా శుభ ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. శివారాధన శ్రేయస్కరం.
మిథునం (Gemini) : మిథున రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. స్వశక్తిని నమ్ముకుంటే మంచిది. ఎవరిపై ఆధారపడొద్దు. వృత్తి వ్యాపారాలలో సంకట పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొంటారు. కుటుంబంలో సానుకూల వాతావరణం ఉంటుంది. కోపావేశాలను అదుపులో ఉంచుకుంటే మంచిది. వృధా ఖర్చులు నివారించాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఆదిత్య హృదయం పారాయణ మేలు చేస్తుంది.
కర్కాటకం (Cancer) : కర్కాటక రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు ఉండకపోవచ్చు. వ్యాపారంలో నష్టాలు ఆందోళన కలిగిస్తాయి. కుటుంబ సభ్యులతో గొడవలకు దిగవద్దు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. కొందరి ప్రవర్తన బాధిస్తుంది. కార్యసిద్ధి హనుమ ఆరాధన శ్రేయస్కరం.
సింహం (Leo) : సింహ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. మీ స్వశక్తితో చేసే పనులు విజయాన్ని చేకూరుస్తాయి. ఆత్మవిశ్వాసం, దృఢ నిశ్చయంతో కష్టమైన పనులను సులభంగా పూర్తి చేస్తారు. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాల్లో, అధికారిక పనుల్లో ఆర్ధిక లాభం పొందుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. సూర్య ఆరాధన శ్రేయస్కరం.
కన్య (Virgo) : కన్యా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. బుద్ధిబలంతో కఠినమైన సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు. భవిష్యత్తుకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుంటారు. విశేషమైన ధనయోగం ఉంది. చాకచక్యంగా వ్యవహరించి కుటుంబ సమస్యలు పరిష్కరిస్తారు. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీ మహాలక్ష్మి ఆలయ సందర్శన శుభప్రదం.
తుల (Libra) : తులా రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి చేపట్టిన పనుల్లో విజయం సిద్ధిస్తుంది. తలపెట్టిన పనులు పూర్తి కావడంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు, ఆర్ధిక లాభాలు ఉంటాయి. విందు వినోదాల కోసం, విలాసాల కోసం అధిక ధనవ్యయం చేస్తారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. ఇష్ట దేవతారాధన శుభప్రదం.
వృశ్చికం (Scorpio) : వృశ్చిక రాశి వారికి ఈ రోజు అదృష్టదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు సహోద్యోగుల, ఉన్నతాధికారుల సహకారం ఉంటుంది. వ్యాపారంలో ఊహించని ధనలాభాలు ఉంటాయి. కుటుంబ విషయాల పట్ల సహనంతో మెలగాలి. సామాజిక గుర్తింపు, పదోన్నతికి కూడా అవకాశం ఉంది! బంధు మిత్రులతో విహారయాత్రలకు వెళ్తారు. ఆరోగ్యం బాగుంటుంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి భుజంగ స్తోత్ర పారాయణ శుభకరం.
ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. అనారోగ్య సమస్యలు తీవ్రంగా ఇబ్బంది పెడతాయి. మీ అనారోగ్యం వృత్తి వ్యాపారాలకు ఆటంకంగా మారుతుంది. ఆర్ధిక సమస్యలు మనశ్శాంతిని దూరం చేస్తాయి. న్యాయపరమైన చిక్కులు ఏర్పడే అవకాశముంది. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. నవగ్రహ శ్లోకాలు పఠించడం ఉత్తమం.
మకరం (Capricorn) : మకర రాశి వారికి ఈ రోజు ప్రతికూల పరిస్థితులు ఉండవచ్చు. కోర్టు వ్యవహారాలలో తీర్పు మీకు వ్యతిరేకంగా వచ్చే అవకాశముంది. అనుకోని ఆర్థికపరంగా నష్టాలు రావడంతో ఆర్ధిక పరిస్థితి క్షీణిస్తుంది. మనోబలం తగ్గకుండా చూసుకోండి. వ్యాపారంలో పురోగతి లోపిస్తుంది. ఉద్యోగులకు స్థానచలనం సూచన ఉంది. దైవారాధన వీడవద్దు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. అభయ ఆంజనేయస్వామి ఆలయ సందర్శనతో ప్రతికూలతలు తొలగిపోతాయి.
కుంభం (Aquarius) : కుంభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముందుచూపుతో పనిచేసి అందరి ప్రశంసలు అందుకుంటారు. లక్ష్యసాధనలో ఏకాగ్రత లోపించకుండా చూసుకోండి. కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. అవసరానికి సరిపడా ధనం చేతికి అందుతుంది. దుర్గాస్తుతి పారాయణ శుభప్రదం.
మీనం (Pisces) : మీన రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమ పెరిగినప్పటికీ సన్నిహితుల సహకారంతో అధిగమిస్తారు. ఉన్నత స్థానంలో నిలవాలనుకుంటే సృజనాత్మకంగా వ్యవహరించండి. వృత్తి పరమైన నైపుణ్యాలు వృద్ధి చేసుకోవడంపై దృష్టి సారిస్తే మంచిది. కుటుంబ కలహాల పట్ల చూసి చూడనట్లు ఉంటే మంచిది. హనుమాన్ చాలీసా పారాయణ శ్రేయస్కరం.