గుండెపోటుకు గురైన వృద్ధుడిని సీపీఆర్ చేసి కాపాడిన మహిళా ఎస్సై - లేడి సింగం వీడియో వైరల్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 13, 2022, 7:02 PM IST

Updated : Feb 3, 2023, 8:35 PM IST

మధ్యప్రదేశ్​లోని గ్వాలియర్​కు చెందిన సోనమ్ పారాశర్ అనే మహిళా ఎస్సై తన మంచి మనసును చాటుకున్నారు. సీపీఆర్ చేసి ఓ వృద్ధుడి ప్రాణాలు నిలబెట్టారు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న అనిల్​ ఉపాధ్యాయ్​ అనే ఓ వృద్ధుడు హఠాత్తుగా గుండెపోటుతో కింద పడిపోయాడు. అక్కడే విధుల్లో ఉన్న సోనమ్ పారాశర్​ సీపీఆర్ చేసి వృద్ధుడిని రక్షించారు. ఆమె చేసి పని పట్ల సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయం రాష్ట్ర హోంమంత్రి నరోత్తం మిశ్రాకు తెలిసింది. మహిళా ఎస్సైకు వీడియో కాల్ చేసి ఆయన అభినందనలు తెలిపారు. సోనమ్ పారాశర్​ను నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. లేడీ సింగం పేరుతో సోనమ్ పారాశర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.