కదిలే రైలు ఎక్కుతూ జారిపడ్డ మహిళ.. లక్కీగా క్షణాల్లోనే.. - అలీగఢ్ రైల్వే స్టేషన్ ప్రమాదం

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 25, 2023, 1:35 PM IST

Passenger Slipped From Moving Train : కదులుతున్న రైలు ఎక్కుతుండగా అదుపుతప్పి జారిపడ్డ మహిళను చాకచక్యంగా వ్యవహరించి కాపాడాడు ఓ ఆర్​పీఎఫ్ కానిస్టేబుల్​. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని అలీగఢ్ రైల్వే స్టేషన్​లో జరిగింది.  

బిహార్​కు చెందిన గుడ్డూ దేవి అనే మహిళ.. లిచ్ఛవి ఎక్స్​ప్రెస్​ ఎక్కేందుకు అలీగఢ్ రైల్వే స్టేషన్​కు సోమవారం వచ్చింది. మూడో నంబరు ప్లాట్​ఫాంలో ఉన్న లిచ్ఛవి ఎక్స్​ప్రెస్​ను ఎక్కే క్రమంలో గుడ్డూ దేవి అదుపు తప్పి జారిపడిపోయింది. అక్కడే విధుల్లో ఉన్న రైల్వే కానిస్టేబుల్ వినోద్ కుమార్ ఈ విషయాన్ని గ్రహించాడు. వెంటనే అప్రమత్తమై రైలు కిందకు జారిపోతున్న గుడ్డూ దేవిని ప్లాట్​ఫాంపైకి లాగాడు. దీంతో ఆమె త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. ఈ ప్రమాద దృశ్యాలు.. రైల్వే స్టేషన్​లో ఉన్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ఆర్​పీఎఫ్ కానిస్టేబుల్ వినోద్​ కుమార్​పై ప్రయాణికులు ప్రశంసలు కురిపించారు. మహిళ ప్రాణాల కాపాడిన అతడికి ధన్యవాదాలు తెలిపారు. రైల్వే ఉన్నతాధికారులు సైతం వినోద్​ కుమార్​ను ప్రశంసించారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.