Woman Halchal in Hyderabad Viral Video : మద్యం మత్తు.. నడిరోడ్డుపై అర్ధనగ్నంగా యువతి హల్చల్.. వచ్చీపోయే వారిని..! - అశోక్‌నగర్‌లో మద్యం మత్తులో యువతి హల్చల్ వైరల్
🎬 Watch Now: Feature Video
Published : Aug 27, 2023, 10:21 AM IST
Woman Halchal in Hyderabad Viral Video : మద్యం మత్తులో ఓ యువతి వీరంగం సృష్టించింది. అర్ధనగ్నంగా రోడ్లపై తిరుగుతూ.. బ్లేడుతో హల్చల్ చేసిన ఘటన హైదరాబాద్‌లోని అశోక్‌నగర్ చౌరస్తాలో చోటుచేసుకుంది. దోమల్‌గూడా పోలీస్‌స్టేషన్ పరిధిలోని అశోక్‌నగర్ రోడ్డు మీదుగా రాకపోకలు సాగిస్తున్న యువకులపై.. సదరు యువతి బ్లేడుతో దాడికి యత్నించింది. వెంటనే అప్రమత్తమైన స్థానిక యువకులు.. స్థానిక పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. అదే సమయంలో అటువైపుగా వెళ్తున్న చిక్కడపల్లి మహిళా ట్రాఫిక్ కానిస్టేబుల్ యువతిని అదుపులోకి తీసుకుని దుస్తులు తొడిగారు. అనంతరం ఆటోలో ఎక్కించుకుని దోమలగూడ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మద్యం మత్తు నుంచి తేరుకున్న యువతి.. కొద్ది సమయం తర్వాత స్వతహాగా పోలీస్‌స్టేషన్ నుంచి బస్సులో ఎక్కి వెళ్లిపోయారని పోలీసులు తెలిపారు. యువతి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవల నగరంలో ఇలాంటి ఘటనలు తరచుగా చోటుచేసుకుంటున్నాయి. మద్యం మత్తులో పలువురు విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తూ.. ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారు.