వేధించిన యువకుడికి మహిళ చెప్పు దెబ్బలు.. అరగంట పాటు! - యువకుడిపై చెప్పు దెబ్బలు
🎬 Watch Now: Feature Video
లైంగిక వేధింపులకు యత్నించిన ఓ యువకుడిని ధైర్యంగా చెప్పుతో కొట్టి బుద్ధి చెప్పింది ఓ మహిళ. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని బైతూల్లో జరిగింది. మార్కెట్ నుంచి తిరిగొస్తుండగా.. మహిళ ఒంటరిగా ఉందని గుర్తించి.. ఆమెపై అఘాయిత్యానికి పాల్పడేందుకు యత్నించాడు ఓ యువకుడు. అయితే ఆమె బెదరకుండా ధైర్యంగా ప్రతిఘటించింది. నడిరోడ్డుపైనే అరగంట పాటు చెప్పుతో చితకబాదింది. చివరకు అతడు కాళ్లు పట్టుకొని క్షమాపణ కోరాడు. దీంతో ఆమె ముందుకు వెళ్లిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST