విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్నిప్రమాదం కేసులో ఆధారాలు సేకరించిన పోలీసులు - సీసీ టీవీ దృశ్యాలు విడుదల
🎬 Watch Now: Feature Video
Published : Nov 25, 2023, 12:51 PM IST
Visakha Fishing Harbor Fire Accident CCTV Footage: విశాఖ ఫిషింగ్ హార్బర్లో బోటు అగ్ని ప్రమాదం ఘటనకు సంబంధించి కేసులో పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి. విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు ప్రధాన నిందితులుగా పోలీసులు నిర్ధారించారు. అగ్ని ప్రమాదానికి కొద్ది నిమిషాలక ముందు హార్బర్లో ఉన్న పరిస్థితిని తెలియజేసే సీసీ దృశ్యాలను విడుదల చేశారు. వీటి ఆధారంగా 10 గంటల 50 నిమిషాలకు అగ్ని ప్రమాదం జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు. ఘటనకు ముందు ఇద్దరు వ్యక్తులు ఫిషింగ్ హార్బర్లో ఓ బోటు నుంచి బయటకు వెళ్తున్నట్టుగా సీసీ కెమెరాలో రికార్డయింది. ఆ ఫుటేజీ ఆధారంగా ఇప్పటికే నిందితులను పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
వారిలో వాసుపల్లి నాని, అల్లిపిల్లి సత్యం అనే ఇద్దరు వ్యక్తులు ప్రధాన నిందితులుగా పోలీసులు నిర్ధారణకొచ్చారు. వారిద్దరూ ఘటన జరిగిన రోజు రాత్రి బోటులో ఉప్పు చేపలను వేపుతున్న సమయంలో నిప్పురవ్వలు ఎగిరిపడి పక్కనే ఉన్న వలపై పడడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.. అలా ఒక్కొక్క బోటుకు మంటలు వ్యాపించి 40కి పైగా బోట్లు దగ్ధమయ్యాయి.