Vemuru SI Attacked on TDP Activist: టీడీపీ కార్యకర్తపై దాడి.. తలను పోలీసు జీపుకు బాదిన ఎస్సై - బాపట్ల జిల్లాలో టీడీపీ కార్యకర్తపై ఎస్సై దాడి
🎬 Watch Now: Feature Video
Published : Sep 11, 2023, 10:27 PM IST
Vemuru SI Attacked on TDP Activist: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఆ పార్టీ తలపెట్టిన బంద్‌లో పోలీసులు ప్రవర్తించిన తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అయితే బంద్ ప్రారంభానికి ముందే వేమూరు ఎస్సై ఓ దళితుడిపై అత్యంత దారుణంగా ప్రవర్తించారు. బాపట్ల జిల్లా వేమూరు ఎస్సై నాగారాజు తెలుగుదేశం కార్యకర్తలపై రెచ్చిపోయారు. వేమూరు మండలం జంపనిలో నిరసనకు సిద్ధమైన టీడీపీ కార్యకర్తలపై ఎస్సై ఆగ్రహంతో ఊగిపోయారు. టీడీపీకు చెందిన ఎస్సీ కార్యకర్త సుధాకర్ చొక్కా పట్టుకుని బలవంతంగా లాక్కెళ్లారు. సుధాకర్ తలను మూడుసార్లు పోలీసు జీపుకు బాదారు. అప్పటికి ఇంకా బంద్ కూడా ప్రారంభించలేదు. నలుగురు కార్యకర్తలు నిరసనకు సిద్ధమవుతున్న తరుణంలో.. అక్కడకు వచ్చిన ఎస్సై సుధాకర్ వారిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బలవంతంగా లాక్కెల్లి జీపుకేసి బాదారు, దుర్భాషలాడారు. ఆ తర్వాత సుధాకర్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించి.. అక్కడ కూర్చోబెట్టారు. కేవలం ఇక్కడే కాకుండా రాష్ట్రంలో పలుచోట్ల పోలీసు అధికారులు ప్రవర్తిస్తున్న తీరుపై అనేక మంది విమర్శలు చేస్తున్న పరిస్థితి నెలకొంది.