'మహిళా పారిశ్రామికవేత్తగా విజయేశ్వరి నారీలోకానికి స్ఫూర్తి' - అంతర్జాతీయ మహిళా దినోత్సవం
🎬 Watch Now: Feature Video
Union Bank Honored Ramoji Film City MD Vijayeshwari: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విజయపథాన పయనిస్తున్న మహిళా పారిశ్రామికవేత్తలకు సత్కార కార్యక్రమం చేపట్టింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఆ బ్యాంక్ దిల్‌సుఖ్‌నగర్ బ్రాంచ్ చీఫ్ మేనేజర్ అనురాధ... రామోజీ ఫిల్మ్ సిటీ ఎండీ విజయేశ్వరిని సన్మానించారు. మహిళా పారిశ్రామికవేత్తగా విజయేశ్వరి నారీలోకానికి స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. 1963 నుంచి ఆరు దశాబ్దాలుగా రామోజీగ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావుతో యూనియన్ బ్యాంకుకు అనుంబంధం ఉందని అనురాధ గుర్తు చేసుకున్నారు. ఆ బంధాన్ని రామోజీ ఫిల్మ్ సీటీ ఎండీ విజయేశ్వరి కొనసాగిస్తున్నారని అనురాధ తెలిపారు. మహిళా పారిశ్రామికవేత్తగా ఆమెను చూస్తే గర్వంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ ఆర్‌ఎఫ్‌సీ బ్రాంచ్ ఇన్‌ఛార్జ్ కుసుమ, సిబ్బంది అంజలి, సురేశ్ పాల్గొన్నారు. గత ఏడాది నవంబర్లో దక్షిణ భారతదేశంలో అత్తుత్తమ పర్యాటక, ఆతిథ్య సేవలకుగానూ రామోజీ ఫిల్మ్ సిటీకి పురస్కారం దక్కింది. బెంగళూరులో నిర్వహించిన దక్షిణ భారత హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ వార్షిక సమ్మేళనంలో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై చేతుల మీదుగా ఫిల్మ్ సిటీ ఎండీ సీహెచ్ విజయేశ్వరి పురస్కారాన్ని అందుకున్న విషయం తెలిసిందే.