Two Pythons Found Viral Video : చెరకు తోటల్లో భారీ కొండచిలువలు.. కుందేళ్లను ఆరగించి.. - చామరాజనగర్​లో లభ్యమైన భారీ కొండచిలువలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telugu Team

Published : Oct 22, 2023, 10:25 PM IST

Updated : Oct 23, 2023, 12:35 PM IST

Two Pythons Found Viral Video : కర్ణాటక.. చామరాజనగర్​లోని చెరకు తోటల్లో ఆదివారం రెండు భారీ కొండచిలువలు కలకలం సృష్టించాయి. హెబ్బసూరు గ్రామంలోని ఓ చెరకు తోటలో 7.5 అడుగుల పొడవున్న కొండచిలువ కనిపించగా.. సిద్ధయ్యనపుర్​ గ్రామానికి చెందిన బసవన్న పొలంలో 10.5 అడుగుల కొండచిలువ కనిపించింది. కుందేళ్లను సుష్ఠుగా తిని ముడుచుకుని పడుకున్నాయి. చెరకు తోటలో పని చేస్తున్న కార్మికులు ఈ భారీ కొండచిలువలను గమనించారు. అనంతరం పాముల సంరక్షకుడికి సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న సంరక్షకుడు.. కొండచిలువలను రక్షించి.. బిలిగిరిరంగ అటవీ ప్రాంతంలో సువర్ణవతి నది వెనుక జలాల్లో వదిలేశాడు.  

ఈ ఏడాది ఫిబ్రవరిలో కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా.. హనకోనా అటవీ సమీపంలో ఓ భారీ కొండచిలువ కలకలం సృష్టించింది. 12 అడుగుల పొడవైన ఈ పాము రాత్రి సమయంలో రోడ్డుపైకి వచ్చింది. రోడ్డుకు ఓవైపు నుంచి మరోవైపునకు వెళ్లేందుకు ప్రయత్నించగా.. అటుగా వెళ్తున్న స్థానికులు, ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఓ ప్రయాణికుడు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేయగా.. వైరల్​గా మారింది. ఆ వీడియో చూడాలంటే ఈ లింక్​పై క్లిక్ చేయండి.  

Last Updated : Oct 23, 2023, 12:35 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.