ఓటుహక్కును వినియోగించుకున్న ట్రాన్స్‌జెండర్స్ - ట్రాన్స్‌జెండర్స్ ఓటింగ్
🎬 Watch Now: Feature Video
Published : Nov 30, 2023, 10:35 PM IST
Transgenders Cast votes in Telangana Assembly Elections 2023 : రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోంది. ఈసారి ఎన్నికల్లో ట్రాన్స్‌జెండర్లు కూడా పెద్ద మొత్తంగా పోలింగ్ కేంద్రాలకు చేరుకొని.. తమ అమూల్యమైన ఓటు హక్కు వినియోగించుకున్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ఎస్‌ఆర్‌ఆర్ తోటలోని పోలింగ్ కేంద్రంలో మొత్తం 315 మంది ట్రాన్స్‌జెండర్స్ ఉండగా.. 215 మంది తమ ఆమూల్యమైన ఓటుహక్కును వినియోగించుకోగా.. మరో 100 మంది మరో పోలింగ్ సెంటర్‌లో ఓటును వేశారు.
Telangana Election Polls 2023 : జగిత్యాల జిల్లాలోని ట్రాన్స్‌జెండర్స్ తమ ఓటు హక్కును వేశారు. జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి నియోజకవర్గాల్లో 45 మంది ఉండగా అందరూ తమ ఓటును సద్వినియోగం చేసుకున్నారు. కోరుట్లలో 10 మంది, జగిత్యాలలో 15 మంది, ధర్మపురిలో 20 మంది ఓటు వేసిన వారిలో ఉన్నారు. ఈసీ తమకు ఓటు హక్కు కల్పించడంపై హర్షం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని తాడుకోల్ గ్రామంలో ఓటుహక్కును ట్రాన్స్‌జెండర్ వినియోగించుకుంది.