పేద జంటలకు పెళ్లిళ్లు చేయించిన ట్రాన్స్‌జెండర్- భిక్షాటన ద్వారా వచ్చిన సొమ్ముతో సాయం - Transgender Jamuna Latest News
🎬 Watch Now: Feature Video
Published : Dec 12, 2023, 4:42 PM IST
Transgender Did Two Couples Marriage In Karnataka : కర్ణాటక కొప్పాళ జిల్లాకు చెందిన ఓ ట్రాన్స్‌జెండర్ రెండు పేద జంటలకు పెళ్లిళ్లు చేయించారు. తాను భిక్షాటన చేసిన డబ్బుతో స్వయంగా దగ్గరుండి మరీ వివాహ క్రతువును జరిపించారు బెన్నూర్ గ్రామానికి చెందిన ట్రాన్స్‌జెండర్ జమున.
'నేను గత నాలుగేళ్లుగా యాచిస్తున్నాను. అలా వచ్చిన డబ్బులో నుంచి కొంత మొత్తాన్ని నా జీవనం కోసం, మిగిలిన దాన్ని ఇలా పేద ఇంటి జంటల పెళ్లిళ్ల కోసం ఖర్చు చేస్తాను. వివాహానికి అవసరమయ్యే బట్టలు, మంగళసూత్రాలు, భోజనం ఖర్చులు మొత్తం నేనే భరిస్తాను. నేను ఇలా పేదలకు సహాయం చేయడం సంతోషంగా ఉంది. మీరందరూ సహకరిస్తే ఇలాంటి మంచి పనులు మరిన్ని చేస్తూ ఉంటాను' అని అన్నారు జమున.
కొంతకాలం క్రితం.. బెన్నూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవి కోసం పోటీ పడి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు జమున. ఇలా జిల్లాలో జరిగిన స్థానిక ఎన్నికల్లో పోటీ చేసిన మొదటి ట్రాన్స్‌జెండర్‌గా ఆమె చరిత్ర సృష్టించారు.