ETV Bharat / offbeat

నోరూరించే "క్యాలీఫ్లవర్‌ పచ్చడి" - ఆవకాయను మించిన టేస్ట్​! - సింపుల్​గా చేసుకోవచ్చు! - CAULIFLOWER PACHADI

ఎప్పుడైనా క్యాలీఫ్లవర్ పచ్చడి తిన్నారా? - ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు!

Pachadi
Cauliflower Pachadi (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 17, 2025, 8:37 PM IST

Cauliflower Pachadi Recipe : మనందరికీ పచ్చళ్లు అనగానే ఆవకాయ, టమాటా, ఉసిరికాయ, చింతకాయ వంటివి ఎక్కువగా గుర్తుకు వస్తుంటాయి. అయితే, అవి మాత్రమే కాదు క్యాలీఫ్లవర్​తో కూడా అద్దిరిపోయే పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఈ క్యాలీఫ్లవర్​ పచ్చడిని ట్రై చేశారంటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు. అంత రుచికరంగా ఉంటుంది! క్యాలీఫ్లవర్ అంటే నచ్చని వాళ్లూ దీన్ని లొట్టలేసుకుంటూ తింటారు. వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటుంటే కలిగే ఆ ఫీలింగ్ అద్భుతమని చెప్పుకోవచ్చు. పైగాదీన్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ! మరి, ఈ సింపుల్ అండ్ టేస్టీ పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? తయారీ విధానమేంటో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • క్యాలీఫ్లవర్‌ - 1
  • ఆవపిండి - మూడున్నర టేబుల్ ​స్పూన్లు
  • కారం - 5 టేబుల్‌ స్పూన్లు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • నిమ్మరసం - 3 టేబుల్‌ స్పూన్లు
  • ఆయిల్ - ముప్పావు కప్పు

తాలింపు కోసం :

  • నూనె - 2 టేబుల్‌ స్పూన్లు
  • ఆవాలు - చెంచా
  • వెల్లుల్లి - ఒక పాయ
  • ఎండుమిర్చి - 3
  • కరివేపాకు - 4 రెబ్బలు
  • ఇంగువ - పావు చెంచా

"తోటకూర టమాటా పచ్చడి" - చూస్తేనే నోట్లో నీళ్లు ఊరుతాయ్!

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా క్యాలీఫ్లవర్‌ను చిన్న పువ్వులుగా తుంచుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై ఒక గిన్నె పెట్టుకొని తగినన్ని వాటర్ పోసి మరిగించుకోవాలి. వాటర్ మరిగి తెర్లుతున్నప్పుడు అందులో ముందుగా తుంచి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ పువ్వులను వేయాలి.
  • నిమిషం పాటు ఉడికించి స్టౌ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫ్యాన్ కింద ఒక శుభ్రమైన వస్త్రం పరచి దాని మీద ఉడికించిన క్యాలీఫ్లవర్ పువ్వులను రెండు గంటల పాటు ఆరబెట్టుకోవాలి.
  • అనంతరం ఒక వెడల్పాటి మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఆవపిండి, ఉప్పు, కారం, సగం నూనె వేసి అన్నీ కలిసేలా ఒకసారి చక్కగా కలపాలి.
  • ఆ తర్వాత అందులో ఆరబెట్టిన క్యాలీఫ్లవర్ పువ్వులు, మిగిలిన ఆయిల్ యాడ్ చేసుకొని మరోసారి ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి.
  • ఇప్పుడు తాలింపుని ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం స్టౌపై కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక ఆవాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ ఇలా ఒక్కొక్కటిగా వేసి పోపుని చక్కగా వేయించుకోవాలి.
  • ఆ తర్వాత తాలింపుని చల్లారనివ్వాలి. అది చల్లారాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చడిలో వేసి తాలింపు చక్కగా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
  • ఆపై దాన్ని ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలు. ఇక ఈ పచ్చడి రెండు రోజులు ఊరిందంటే నోరూరించే కమ్మని ‘క్యాలీఫ్లవర్‌ పచ్చడి’ రెడీ!

బ్యాచిలర్స్ స్పెషల్ కమ్మని "టమాటా పచ్చడి" - ఉడకబెట్టకుండా పదే పది నిమిషాల్లో రెడీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.