ఫ్లాట్‌ఫాంపైకి దూసుకొచ్చిన లోకల్ ట్రైన్.. ప్రయాణికుల పరుగులు - లోకల్ రైలు
🎬 Watch Now: Feature Video
Local train derailment: తమిళనాడులో ఓ లోకల్ ట్రైన్ ఫ్లాట్‌ఫాంపైకి దూసుకొచ్చింది. చెన్నైలోని బీచ్ రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన జరగగా.. రైలు ఖాళీగా ఉండటం వల్ల పెను ప్రమాదం తప్పింది. అయితే లోకోపైలెట్‌కు గాయాలు కాగా అతడ్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. రైలు నియంత్రణ కోల్పోయి భారీ శబ్దంతో స్టేషన్‌లోకి దూసుకురాగా.. ప్లాట్‌ఫాంపై ఉన్న ప్రయాణీకులందరూ పరుగులు పెట్టారు. ఈ క్రమంలో ఫ్లాట్‌ఫాంపై ఉన్న షెల్టర్‌ను ఢీకొట్టి రైలు ఆగిపోయింది. చెన్నై వర్క్‌షాప్ నుంచి కోస్టల్ రైల్వేస్టేషన్‌కు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. బ్రేకులు సకాలంలో పడకపోవడంతోనే రైలు ఫ్లాట్‌ఫామ్‌పైకి దూసుకొచ్చినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST