ETV Bharat / offbeat

తిన్నాకొద్దీ తినాలనిపించే "పాలక్ బనానా కర్రీ" - ఒక్కసారి టేస్ట్ చేస్తే వదిలిపెట్టరంతే! - PALAK BANANA CURRY

వేడివేడి అన్నం, రోటీలలోకి సూపర్ కాంబో - "పాలక్ బనానా కర్రీ" సింపుల్​గా చేసుకోండిలా!

HOW TO MAKE PALAK BANANA CURRY
Palak Banana Curry Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 28, 2024, 7:16 PM IST

Palak Banana Curry Recipe in Telugu : పోషకాలు పుష్కలంగా ఉండే ఆకుకూరల్లో ఒకటి పాలకూర. అయితే, చాలా మంది పాలకూరతో నేరుగా చేసే వంటకాలను అంతగా తినడానికి ఇష్టపడరు. ఈ క్రమంలోనే ఎక్కువ మంది పాలకూరతో రకరకాల కాంబినేషన్ కర్రీలు ట్రై చేస్తుంటారు. అలాంటి ఓ సూపర్ రెసిపీనే మీకోసం పట్టుకొచ్చాం. అదే "పాలక్ బనానా కర్రీ". దీన్ని చేసుకోవడం చాలా సులువు! రుచి కూడా పాలక్ పనీర్ కంటే అద్భుతంగా ఉంటుంది! పైగా ఈ కర్రీ ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది. ఎప్పుడూ రొటీన్ కర్రీలు తిని బోరింగ్​ అనిపించిన వారికి సరికొత్త టేస్ట్​ని అందిస్తుంది. మరి, ఇంకెందుకు ఆలస్యం ఈ సూపర్ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా తయారు చేసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • పాలకూర - 7 మీడియం సైజ్​ కట్టలు
  • పచ్చి అరటికాయలు - 2
  • వెల్లుల్లి రెబ్బలు - 5
  • అల్లం - అర అంగుళం ముక్క
  • పచ్చిమిర్చి - కారానికి తగినన్ని
  • నూనె - 3 టేబుల్​స్పూన్లు
  • పసుపు - చిటికెడు
  • జీలకర్ర - అరటీస్పూన్
  • ఎండుమిర్చి - 2
  • ఇంగువ - పావుటీస్పూన్
  • సన్నని వెల్లుల్లి తరుగు - ఒకటిన్నర టేబుల్​స్పూన్లు
  • ఉల్లిపాయ - 1
  • ధనియాల పొడి - అరటీస్పూన్
  • వేయించిన జీలకర్ర పొడి - అరటీస్పూన్
  • ఉప్పు - రుచికి సరిపడా
  • గరంమసాలా - అరటీస్పూన్
  • నెయ్యి - 1 టీస్పూన్

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా స్టౌపై గిన్నె పెట్టి వాటర్ పోసి మరిగించాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు పాలకూరను ఆకులు ఆకులుగానే అందులో వేసి పూర్తిగా మునగనివ్వాలి. ఆపై హై ఫ్లేమ్ మీద ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి. అంటే, రెండు మూడు పొంగులు వస్తే సరిపోతుంది.
  • అంతేకానీ మరీ ఎక్కువగా ఉడికించుకోవద్దు. ఒకవేళ అలా ఉడికించుకుంటే ఆకులు ముదురు రంగులోకి మారిపోతాయి. తినడానికి అంత రుచికరంగా అనిపించదని గుర్తుంచుకోవాలి.
  • ఆ విధంగా ఉడికించుకున్నాక పాలకూరను తీసి చల్లని నీరు ఉన్న మరో బౌల్​లో వేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా పాలకూర సగంపైనే మగ్గిపోతుంది. అలాగే ఆకుల రంగు కూడా పచ్చగానే ఉంటుంది.
  • ఇప్పుడు స్టౌపై మరో గిన్నె పెట్టుకొని అందులోనూ సగం వరకు నీళ్లు పోసి మరిగించుకోవాలి. వాటర్ మరిగాక రెండు ఇంచుల పరిమాణంలో కట్ చేసుకున్న పచ్చి అరటికాయ ముక్కలు వేసి 50% వరకు ఉడికించుకోవాలి. ఆవిధంగా ఉడికించుకున్నాక అరటికాయ ముక్కలను వడకట్టి పూర్తిగా చల్లారనివ్వాలి.
  • అనంతరం మిక్సీ జార్ తీసుకొని అందులో చల్లారిన పాలకూర ఆకులు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం, మీ రుచికి తగినన్ని పచ్చిమిర్చితో పాటు తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్​లా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక ఉడికించి చల్లార్చుకున్న అరటికాయ ముక్కలు, పసుపు వేసి క్రిస్పీగా మారి గోల్డెన్ కలర్​లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆపై వాటిని ఒక ప్లేట్​లోకి తీసుకొని పక్కనుంచాలి.
  • ఆ తర్వాత మిగిలిన నూనెలో జీలకర్ర, ఎండుమిర్చి ముక్కలు, ఇంగువ వేసి కాసేపు వేయించుకోవాలి. అవి వేగాక సన్నని వెల్లుల్లి తరుగు వేసి లైట్ గోల్డెన్ కలర్​లోకి వచ్చేంత వరకు వేపుకోవాలి.
  • అనంతరం ఉల్లిపాయ సన్నని తరుగు వేసి అవి కాస్త మెత్తబడి రంగు మారేంత వరకు వేయించుకోవాలి.
  • ఆవిధంగా వేయించుకున్నాక అందులో ముందుగా మిక్సీ పట్టుకున్న పాలకూర మిశ్రమం, అర కప్పు వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి.
  • ఆపై మీడియం ఫ్లేమ్ మీద పాలకూరలోని పసరు వాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. అందుకోసం 12 నుంచి 15 నిమిషాల వరకు టైమ్ పట్టొచ్చు.
  • ఆవిధంగా ఉడికించుకున్నాక అందులో ధనియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి, గరంమసాలా, ఉప్పు వేసుకొని కలిపి మరో 2 నుంచి 3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి.
  • అనంతరం వేయించి పక్కన పెట్టుకున్న అరటికాయ ముక్కలు వేసి పాలక్ మిశ్రమం ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి.
  • ఆ తర్వాత 100ఎంఎల్ వాటర్ పోసుకొని కలిపి మీడియం ఫ్లేమ్ మీద కూర చిక్కగా మారి నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి.
  • ఆఖర్లో నెయ్యి వేసుకొని కలిపి దింపేసుకుంటే చాలు. అంతే, ఎంతో టేస్టీగా ఉండే "పాలక్ బనానా కర్రీ" రెడీ!
  • దీన్ని వేడివేడి అన్నం, చపాతీ, రోటీ ఇలా దేనిలోకి తిన్నా ఆ రుచి అద్భుతంగా ఉంటుంది. మరి, నచ్చిందా అయితే మీరూ ఓసారి ఈ రెసిపీని ట్రై చేయండి.

ఇవీ చదవండి :

"పాలకూర కిచిడీ" పోషకాల పంట - నిమిషాల్లో ప్రిపేర్​ చేసుకోండిలా!

బంధువులు వస్తే చికెన్, మటన్ కంటే - ఇలా "పాలకూర ఉల్లికారం" చేసి పెట్టండి! - ఇష్టంగా తింటారు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.