'ధరలు తగ్గేలా చూడు దేవుడా!'.. టమాటాల దండలతో ప్రత్యేక పూజలు
🎬 Watch Now: Feature Video
Tomato Garlands To Goddess : దేశంలో టమాటాల ధరలు భారీగా పెరిగిన వేళ.. తమిళనాడు నాగపట్టిణం జిల్లాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు. 508 టమాటాలతో ప్రత్యేకంగా ఓ దండను తయారు చేసి.. దేవతా విగ్రహాలను అలంకరించారు. పూలు, నిమ్మకాయల మాలను సైతం దేవుళ్లకు సమర్పించుకున్నారు. మరియమ్మన్, నాగమ్మన్, మధురై వీరన్ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజల సుఖశాంతులతో ఉండాలని, టమాటా ధరలు తగ్గాలని భక్తులు భగవంతులను వేడుకున్నారు. దేవుళ్ల విగ్రహాలకు అభిషేకాలు సైతం నిర్వహించారు. 'ఆడి' మాస పౌర్ణమి సందర్భంగా గరుకుడి పట్టణంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు భక్తులు. నాగపట్టిణం, తిరువారూర్, కారైకల్, మైలాడుతురై ప్రాంతాల నుంచి భక్తులు ఈ పూజలకు హాజరయ్యారు. భాజాభజంత్రీల మధ్య ఘనంగా ఈ వేడుకలు జరిగాయి.
tomato price hike india : గత కొద్ది రోజులుగా దేశంలో టమాటా ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. కిలో టమాటా ధర కనీసం 150 రూపాయలుగా పైగానే ఉంది. దీంతో టమాటాలు కొనలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల టమాటాల దొంగతనాలు కూడా జరుగుతున్నాయి.