ఎప్పటికీ తెలుగు దేశం పార్టీని మర్చిపోను : మంత్రి తుమ్మల - Thummala Thanks to TDP
🎬 Watch Now: Feature Video
Published : Jan 1, 2024, 8:57 PM IST
Thummala Nageswara Rao Intreasting Comments on TDP : నేడు దేశంలో సంక్షేమ రాజ్యానికి ఆద్యుడు తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Thummala Nageswara Rao ) అన్నారు. గతంలో ఎన్టీఆర్ ప్రవేశ పెట్టిన పథకాలను ప్రస్తుతం దేశంలో ఏ రాష్ట్రం అమలు పరచకుండా పరిపాలించే పరిస్థితి లేదన్నారు. నూతన సంవత్సర వేడుకలతో పాటు కృతజ్ఞతలు తెలిపేందుకు ఖమ్మం తెలుగు దేశం పార్టీ కార్యాలయానికి ఆయన విచ్చేశారు. టీడీపీ కార్యకర్తలు ఆయనను ఘనంగా సన్మానించారు.
Thummala New Year Celebrate in TDP Office : టీడీపీ కార్యకర్తలు తుమ్మల నాగేశ్వరరావుకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. టీడీపీ కార్యకర్తలు ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ విజయానికి నిబద్దతతో పని చేశారని పేర్కొన్నారు. వారి కృషి వల్ల కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలుచుకోగలిగిందని చెప్పారు. తన విజయానికి పని చేసిన టీడీపీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. తాను ఎప్పటీకి తెలుగు దేశాన్ని మరిచిపోనన్నారు.