స్కూటీతో యువకుడ్ని ఈడ్చుకెళ్లిన దుండగులు.. కారణమేంటి? - ఉత్తర్‌ప్రదేశ్‌లో యువకుడ్ని ఈడ్చుకెళ్లిన దుండగులు
🎬 Watch Now: Feature Video
Three Bullies Dragged Young Man From Scooty : ఓ యువకుడిని రోడ్డుపై దారుణంగా ఈడ్చుకెళ్లారు ముగ్గురు దుండగులు. స్కూటీపై వెళ్తూ అందరూ చూస్తుండగా యూవకుడిని లాక్కెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో జరిగిన ఈ ఘటనపై పోలీసు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ జరిగింది..
అందరి ముందే.. ముగ్గురు దుండగులు స్కూటీపై వెళ్తూ ఓ యువకుడి చేయి పట్టుకుని ఈడ్చుకెళ్లారు. ఈ ఘటన దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. నెటిజన్లు తెగ షేర్ చేశారు. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. అనంతరం పోలీసుల దృష్టికి వెళ్లింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బారాదారీ ప్రాంతంలోని సంజయ్ నగర్లో న జరిగిందని ప్రాథమికంగా పోలీసులు అంచనా వేశారు. అయితే ఆ వీడియో రికార్డైన ఘటన ఎక్కడ జరిగింది? నిందితులు ఎవరు? బాధితుడు ఎవరు? అక్కడ ఏం జరిగింది?.. వాటికి సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నాముని బారాదారీ ఎస్ఐ అభిషేక్ సింగ్ తెలిపారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.