ETV Bharat / technology

WiFi స్పీడ్ స్లో అయిందా? ఈ టిప్స్‌తో ఇంటర్నెట్​ వేగం​ పెంచుకోండిలా! - TIPS FOR GET GOOD INTERNET SPEED

ఇంటర్నెట్‌ స్సీడ్‌ స్లో అయిందా? ఇలా చేస్తే ఫుల్ స్పీడ్!

Tips For Get Good Internet Speed
Tips For Good Internet Speed (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 31, 2025, 7:26 PM IST

Tips For Get Good WiFi Internet Speed : ఈ కాలంలో ప్రతి ఇంట్లో ఇంటర్నెట్ ఉండటం కామన్ అయిపోయింది. మనం రోజూ ఉపయోగించే ఫోన్లతో పాటు కంప్యూటర్లు, ఇంట్లో ఉన్న స్మార్ట్ స్పీకర్లు, స్మార్ట్ వాచ్, స్మార్ట్ బల్బ్ మొదలైన అన్ని స్మార్ట్ డివైస్‌లు Wi-Fiపై ఆధారపడి ఉంటాయి. అయితే కొన్ని సార్లు ఇంటర్నెట్‌ వేగం తగ్గిపోయి కనెక్టివిటీ సమస్యలు ఎదురవుతాయి. దీనికి అనేక కారణాలున్నాయి. ఇందుకోసం కొందరు కొత్త రూటర్‌ను కొనుగోలు చేస్తారు. లేదా బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్‌ మార్చుకుంటారు. ఇంటర్నెట్ ప్రొవైడర్‌ను సంప్రదిస్తారు. కానీ ఇవన్నీ చేయక ముందు ఒక్కసారి ఈ 9 ట్రిక్స్‌ ట్రై చేసి చూడండి.

1. స్పీడ్ టెస్ట్ చేయండి
మీ ఇంటర్నెట్ వేగం తగ్గిందనిపిస్తే, మొదటగా ఒకసారి స్పీడ్ టెస్ట్ చేయండి. మీ ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్ ఏవైనా మెయింటెనెన్స్‌ పనులు చేస్తున్నారోమో చూడండి. తర్వాత ఒకసారి అన్ని డివైజ్‌లలో ఇంటర్నెట్‌ డిస్‌కనెక్ట్‌ చేసి ఒక డివైజ్‌కు మాత్రం కనెక్ట్‌ చేసి చూడండి. అది కూడా రూటర్‌ కేబుల్‌ పెట్టి చూస్తే స్పీడ్‌ ఎంత వస్తుందో క్లారిటీగా తెలుస్తుంది. ఇది కాకుండా ఇంటర్నెట్‌ స్పీడ్‌ గురించి తెలుసుకోవడానికి Speedtest.net లేదా Fast.com వంటి వెబ్‌సైట్లు ఉపయోగించండి.

2. రూటర్‌ అమర్చిన ప్రాంతం
నెట్‌ స్పీడ్‌ తగ్గడానికి మరో కారణం ఏంటంటే రూటర్‌ అమర్చిన ప్రాంతం. మీరు ఎంత స్పీడ్‌ కెపాసిటీ ఉన్న బ్రాడ్‌బ్యాండ్‌ కొనుగోలు చేసినా రూటర్‌ను సరైన ప్రాంతంలో పెట్టకపోతే స్పీడ్‌ సమస్య వస్తుంది. రూటర్‌ను ఇంటి మధ్యలో ఉంచడం వల్ల నలు మూలలకూ సరైన సిగ్నల్ అందుతుంది. వీలైతే ఎత్తైన ప్రదేశంలో, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులకు దూరంగా ఉంచడం వల్ల మరింత స్పీడ్‌ వస్తుంది. మీ రూటర్‌లో ఒకవేళ యాంటినాలు ఉంటే సిగ్నల్‌ వీక్‌గా వస్తున్న ప్రాంతానికి వాటిని తిప్పండి. ఈ చిన్న మార్పులు సిగ్నల్‌, స్పీడ్‌ను పెరగడానికి తోడ్పడతాయి.

3. కనెక్టెడ్‌ డివైజెస్​తో పాటు ఇతర అంతరాయాలు పరిశీలించండి
ఫ్రిడ్జ్‌లు, మైక్రోవేవ్ ఓవెన్‌లు వంటి ఉపకరణాలు ఇంటర్నెట్‌ స్పీడ్‌ తగ్గడానికి కారణం కావచ్చు. మీ రూటర్‌కి, మీ డివైజ్‌కి మధ్య ఇవి ఉంటే స్పీడ్‌ తగ్గే అవకాశం ఉంది. అలాగే మీ పొరుగు ఇంట్లోని వై-ఫై నెట్‌వర్క్ కూడా స్పీడ్‌ తగ్గవచ్చు. ఇంటర్‌కమ్‌ కోసం ఉపయోగించే ఫోన్లు 2.4GHz ఫ్రీక్వెన్సీ ఉపయోగించే కలిగి ఉంటాయి. ఇదీ కారణం కావచ్చు. కాబట్టి వీటన్నింటికి దూరంగా రూటర్‌ను ఉంచడం మంచిది.

4. 5GHz బ్యాండ్‌ను ఉపయోగించండి
ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ అందించిన రూటర్‌, డ్యూయల్-బ్యాండ్‌ సపోర్ట్‌ చేస్తుందో లేదో చూడండి. ఎందుకంటే కొత్త డివైస్‌లు 5GHz ను సపోర్ట్‌ చేస్తాయి. ఇవి తక్కువ రేంజ్‌లోనే ఎక్కువ స్పీడ్‌ అందిస్తాయి. అదే పాత మోడల్‌ రూటర్స్‌ అయితే 2.4GHz బ్యాండ్‌కే సపోర్ట్ చేస్తాయి. కాబట్టి, వై-ఫై నెట్‌వర్క్ లిస్ట్‌లో కొత్త 5GHz కనెక్షన్ ఉంటే దాన్ని ఎంచుకోవడం ఉత్తమం.

5. ఛానెల్ మెయింటెనెన్స్‌ చెక్ చేయండి
సాధారణంగా రూటర్‌ 2.4GHz, 5GHz అనే రెండు బ్యాండ్స్‌లో పని చేస్తుంది. కానీ వీటిలో అనేక ఛానెల్స్ ఉంటాయి. ఉదాహరణకు, 2.4GHz బ్యాండ్ గరిష్టంగా 14 ఛానెల్‌లను కలిగి ఉంటుంది, 5GHz బ్యాండ్ దాదాపు 130 ఛానెల్‌లను కలిగి ఉంటుంది. ఈ ఛానెల్‌ డిస్ట్రిబ్యూషన్‌ను రూటర్ మెయింటెన్‌ చేస్తుంది. ఆధునిక రూటర్లు రద్దీని బట్టి డివైజ్‌లను ఛానెళ్లను డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. తక్కువ ట్రాఫిక్ ఉన్న ఛానెల్‌ను ఎంచుకోవడం ద్వారా ఇంటర్నెట్ వేగాన్ని మెరుగు పర్చుకోవచ్చు. ఛానెల్ వినియోగాన్ని చెక్ చేయడానికి WiFiInfoView (Windows) లేదా Wi-Fi Analyzer (Android/iOS) యాప్‌లు ఉపయోగించవచ్చు.

6. రూటర్‌ అప్‌గ్రేడ్ చేయండి
కనెక్టివిటీ సమస్యకు పాత రూటర్ కూడా కారణం కావచ్చు. ISP అందించే డిఫాల్ట్ రూటర్ ప్రాథమిక వినియోగానికి సరిపోతుంది. కానీ మీరు ఇంట్లో ఎక్కువ డివైస్‌లను ఉపయోగిస్తే వాటి కనెక్షన్‌ కోసం మెరుగైన స్టాండ్‌ అలోన్‌ రూటర్‌ కావాలి. ఇది అధిక లోడ్‌ను నిర్వహించేలా ఉండాలి. కొత్త రూటర్‌కు మారిన తర్వాత, మీ ISP రూటర్‌లోని వై-ఫైని ఆఫ్ చేయడం మంచిది.

7. రేంజ్ ఎక్స్టెండర్ లేదా రెండో రూటర్‌ వాడటం
ఒక వేళ మీ ఇల్లు చాలా పెద్దగా ఉంటే అన్ని వైపులా సిగ్నల్‌ రావడం కొంచెం ఇబ్బంది అవుతుంది. నలువైపులా సిగ్నల్‌ రావాలంటే మెష్‌ వైఫై రూటర్‌ సిస్టం తీసుకోవాలి. ఇది కొంచెం ఖరీదు కాబట్టి, దీనికి బదులు రేంజ్‌ ఎక్స్‌టెండర్‌ లేదా సెకండరీ రూటర్‌ తీసుకోవచ్చు. మీ పాత రూటర్‌ను సైతం రేంజ్‌ ఎక్స్‌టెండర్‌గా ఉపయోగించవచ్చు.

8. క్వాలిటీ ఆఫ్‌ సర్వీస్‌ సెట్టింగ్స్‌ను మార్చడం
మీరు గేమింగ్‌ కానీ వీడియో స్ట్రీమింగ్‌ లాంటి వాటి వల్ల ఇంటర్నెట్‌ స్పీడ్‌ మందగిస్తుంది. ఇందుకోసం మీ రూటర్‌లోని Quality of Service (QoS) సెట్టింగ్స్‌ను చెక్‌ చేసుకోవాలి. మీ రూటర్‌ మీరు వాడుతున్న అప్లికేషన్‌ బట్టి నెట్‌ ప్రాధాన్యాలను ఇవ్వకపోతే మాన్యువల్‌గా సెట్ చేయండి. ప్రతి రూటర్‌లో ఏదో ఒక రకమైన QoS ఉంటుంది కాబట్టి మీ మోడల్‌ను చెక్‌ చేసి తదనుగుణంగా సెట్టింగ్‌లను సర్దుబాటు చేయడం ఉత్తమం.

9. హైయ్యర్-స్పీడ్ ప్లాన్‌ను పరిశీలించండి
ఇవన్నీ ప్రయత్నించినా మీ ఇంటర్నెట్ వేగం సరిపోకపోతే మీ ISP హైయ్యర్-స్పీడ్ ప్లాన్ అందిస్తుందా లేదా చూడండి. ఇంట్లో అందరూ కనెక్షన్‌ ఉపయోగిస్తే, దానికి ఇతర స్మార్ట్‌ హోమ్‌ అప్లయెన్సెస్‌ కూడా కనెక్ట్‌ అయి ఉంటే, ఎక్కువ Mbps కలిగిన ప్లాన్ తీసుకోవడం ఉత్తమం. అయితే, మీ రూటర్ ఆ వేగాన్ని హ్యాండిల్ చేస్తుందా లేదా కూడా చెక్ చేయాలి.

మీ మొబైల్​ ఇంటర్నెట్​ స్లోగా ఉందా? ఈ సింపుల్ టిప్స్​తో స్పీడ్​ పెంచుకోండిలా!

హ్యాకర్స్ నుంచి Wifiను కాపాడుకోవాలా? ఈ 6 టిప్స్​ మీ కోసమే! - How To Protect Wifi From Hackers

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.