ETV Bharat / offbeat

"తోటకూర టమాటా పచ్చడి" - చూస్తేనే నోట్లో నీళ్లు ఊరుతాయ్! - THOTAKURA TOMATO PACHADI

తోటకూరతో అద్దిరిపోయే పచ్చడి - వేడి వేడి అన్నంలో నెయ్యితో తింటే ఆ టేస్టే వేరబ్బా!

How to Make  Thotakura Tomato Pachadi
Thotakura Tomato Pachadi (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 31, 2025, 7:30 PM IST

Thotakura Tomato Pachadi Recipe : ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ క్రమంలోనే ఎక్కువ మంది తోటకూరను చాలా ఇష్టంగా తింటుంటారు. అయితే, మీరు ఇప్పటి వరకు తోటకూరతో పప్పు, కర్రీ వంటి వాటిని చేసుకొని ఉంటారు. కానీ, ఓసారి ఇలా "తోటకూర టమాటా పచ్చడి"ని ట్రై చేయండి. వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని ఈ చట్నీతో తింటుంటే వారెవ్వా ఏం టేస్ట్ గురూ అనాల్సిందే! అంత రుచికరంగా ఉంటుంది ఈ పచ్చడి. ఆకుకూరలు ఇష్టపడని వారూ దీన్ని చాలా ఇష్టంగా తింటారు. మరి, ఈ హెల్దీ అండ్ టేస్టీ పచ్చడికి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • తోటకూర - 3 కట్టలు(మీడియం సైజ్​వి)
  • టమాటాలు - 4(మీడియం సైజ్​వి)
  • నూనె - 2 టేబుల్​స్పూన్లు
  • మెంతులు - చిటికెడు
  • జీలకర్ర - అరటీస్పూన్
  • తెల్ల నువ్వులు - 1 టేబుల్​స్పూన్
  • పచ్చిమిర్చి - రుచికి సరిపడా
  • చింతపండు - ఉసిరికాయ సైజంత
  • పసుపు - పావుటీస్పూన్
  • వెల్లుల్లి రెబ్బలు - 10
  • ఉప్పు - రుచికి సరిపడా

తాలింపు కోసం :

  • నూనె - 2 టేబుల్​స్పూన్లు
  • పోపు గింజలు - 1 టేబుల్​స్పూన్
  • ఎండుమిర్చి - 3
  • కరివేపాకు - 2 రెమ్మలు
  • ఉల్లిపాయ - 1(మీడియం సైజ్​ది)

"కొత్తిమీర నిల్వ పచ్చడి" - ఇలా చేస్తే వారెవ్వా! - కనీసం 6 నెలలు నిల్వ!

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా తోటకూరను చిన్న చిన్న కాడలతో సహా తుంపుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఆపై శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే, టమాటాలను ముక్కలుగా కట్ చేసుకొని పక్కనుంచాలి.
  • ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త వేడయ్యాక మెంతులు, జీలకర్ర, తెల్ల నువ్వులు వేసి కలిపి చిటపటమనిపించాలి. ఆ తర్వాత వెంటనే పచ్చిమిర్చిని ముక్కలుగా తుంపి వేసుకొని కలిపి మూతపెట్టి లో ఫ్లేమ్ మీద 2 నిమిషాలు మగ్గించుకోవాలి.
  • పచ్చిమిర్చి చక్కగా మగ్గిన తర్వాత ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న తోటకూరను వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఆపై మూతపెట్టి లో ఫ్లేమ్ మీద తోటకూర కాస్త మగ్గే వరకు రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత మూత తీసి గరిటెతో కలుపుతూ తోటకూరను మరో రెండు నిమిషాల పాటు ఆయిల్​లో వేయించుకోవాలి. ఇలా చేయడం ద్వారా పచ్చడి రుచి బాగుంటుంది.
  • ఆ విధంగా వేయించుకున్నాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, చింతపండు, పసుపు యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి.
  • అనంతరం మంటను సిమ్​లోనే ఉంచి మూతపెట్టి టమాటా ముక్కలు బాగా మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత స్టౌ ఆఫ్ చేసుకొని మిశ్రమాన్ని కాస్త చల్లారనివ్వాలి.
  • ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో చల్లారిన తోటకూర మిశ్రమం, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఆపై దాన్ని ఒక బౌల్​లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • అనంతరం తాలింపుని ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం స్టౌపై చిన్న కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త వేడెక్కాక మంటను సిమ్​లో ఉంచి పోపు దినుసులు వేసి వేయించుకోవాలి. అవి వేగాక ఎండుమిర్చి తుంపలు, కరివేపాకు వేసుకొని వేయించాలి. ఇక చివర్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ చీలికలు వేసుకొని కాస్త వేయించుకొని దింపుకోవాలి.
  • ఆ తర్వాత తాలింపుని ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చడిలో వేసి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. అంతే, ఘుమఘుమలాడే "తోటకూర టమాటా పచ్చడి" రెడీ!

కమ్మటి "పండుమిర్చి పచ్చడి" - ఈ కొలతలతో పెడితే ఏడాది నిల్వ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.