కదులుతున్న రైలులో దొంగతనం చేస్తూ దొరికిన దొంగ- కిటికీకి వేలాడదీసిన ప్రయాణికులు - కదులుతున్న రైలు కిటికీలో దొంగ
🎬 Watch Now: Feature Video


Published : Jan 17, 2024, 9:54 PM IST
|Updated : Jan 17, 2024, 10:49 PM IST
Thief Hanging To Moving Train Window : రైలులోని వ్యక్తి పర్సును దొంగిలించేందుకు ప్రయత్నించిన ఓ దొంగను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు తోటి ప్రయాణికులు. అనంతరం అతడిని కదులుతున్న రైలు కిటికీకి వేలాడదీశారు. ఈ ఘటన బిహార్ భాగల్పుర్ జిల్లాలోని ఓ రైల్వే స్టేషన్లో జరిగింది. అతడి రెండు చేతులు పట్టుకొని కొన్ని మీటర్ల దూరం వరకు అతడిని అలానే పట్టుకున్నారు. ఈ క్రమంలో రైలు ట్రాక్ మారుతున్న సమయంలో అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు దొంగను కిందకు దింపి పక్కకు తీసుకెళ్లారు. ఈ దృశ్యాలను రైలులో ప్రయాణిస్తున్న కొందరు ప్రయాణికులు తమ ఫోన్లలో బంధించారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం అవి వైరల్‌గా మారాయి. ఇదే విషయమై భాగల్పుర్ రైల్వే ఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ రణధీర్ కుమార్‌ను సంప్రదించగా, అటువంటి కేసు ఏమీ తమ దృష్టికి రాలేదని పేర్కొన్నారు. జీఆర్‌పీతో మాట్లాడిన అనంతరం కేసును విచారిస్తామని తెలిపారు.