అమెరికాలో అయోధ్య ఫీవర్- రాముడి కోసం కార్లతో మ్యూజికల్ లైట్ షో - ram devotees car light show
🎬 Watch Now: Feature Video
Published : Jan 14, 2024, 6:04 PM IST
Tesla Car Musical Light Show In US : అయోధ్య శ్రీరాముడి ఆలయ ప్రతిష్ఠా పన మహోత్సవానికి సమయం సమీపిస్తున్న వేళ ప్రపంచవ్యాప్తంగా హిందువులు శ్రీరామ నామస్మరణలో మునిగిపోతున్నారు. అమెరికాలోని ఆలయాలు శ్రీరామ జపంతో మార్మోగుతున్నాయి. తాజాగా రామ్ లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ ఫీవర్ అమెరికాను తాకింది. మేరీల్యాండ్‌లో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో 150 టెస్లా కార్లతో నిర్వహించిన మ్యూజికల్ లైట్ షో ఆకట్టుకుంది. భక్తులు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. రాముడి జెండాలను ప్రదర్శిస్తూ భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు.
విశ్వహిందూ పరిషత్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొనడం తమకు సంతోషాన్ని కలిగించిందని ప్రవాసీయులు అన్నారు. 1992 నుంచి అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన జరుగుతుందన్న మాటలు తరచూ వినపడేవని, ప్రస్తుతం ఆ కార్యక్రమం జరుగుతుండటం తమకు ఆనందాన్ని కలిగిస్తోందని అన్నారు. ఈనెల 22న జరగనున్న ప్రాణ ప్రతిష్ఠను చూడటానికి ఉత్సాహంగా ఎదురు చూస్తున్నామని వెల్లడించారు.