ఫైనల్లో టీమ్ఇండియా ఓటమి- టీవీ పగలగొట్టి ఫ్యాన్స్ రచ్చ - టీవీ పగలగొట్టిన ఫ్యాన్స్ టీమ్ఇండియా ఫ్యాన్స్
🎬 Watch Now: Feature Video
Published : Nov 20, 2023, 7:32 AM IST
Team India Fans Broke TV : వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతుల్లో టీమ్ఇండియా ఓటమి పాలవ్వడం వల్ల దేశవ్యాప్తంగా భారత్ క్రికెట్ జట్టు ఫ్యాన్స్ ఎంతో బాధపడ్డారు. కొందరు కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. అయితే ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగఢ్‌కు చెందిన కొందరు అభిమానులు.. టీమ్ఇండియా ఓటిమితో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీవీని తీసుకొచ్చి రోడ్డుపై పగలగొట్టారు. భారత క్రికెట్ జట్టుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
భారత్ జట్టు విజయం సాధిస్తుందని అంతా అనుకున్నామని టీమ్ఇండియా ఫ్యాన్ ప్రదీప్ తెలిపాడు. ఫైనల్ మ్యాచ్‌లో టీమ్ఇండియా ఓడిపోవడం వల్ల 140 కోట్ల మంది ప్రజలు షాక్‌కు గురయ్యారని చెప్పాడు. భారత్ ఓటమితో తామంతా తీవ్ర దిగ్భ్రాంతికి లోనైనట్లు పేర్కొన్నాడు. భారత్-ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా సాగిందని, అయితే టీమ్ఇండియా గెలవలేకపోవడం దురదృష్టకరమని మరో అభిమాని సచిన్ చెప్పాడు. "ఈ టోర్నీలో మొత్తం 10 మ్యాచ్‌ల్లో భారత్ గెలిచింది. 11వ మ్యాచ్‌లో కూడా టీమ్ఇండియా గెలుస్తుందని భావించాం. కానీ అది జరగలేదు. ఆసీస్ చేతిలో భారత్ ఓటమితో తీవ్ర నిరాశ నెలకొంది. అందుకే కోపంతో టీవీ పగలగొట్టేశాం" అని సచిన్ తెలిపాడు.