ETV Bharat / spiritual

సూర్యుని ఆరాధించే 'రథసప్తమి'- ఈ దానాలు చేస్తే ఆయురారోగ్య ఐశ్వర్యాలు మీ సొంతం! - RATHA SAPTAMI 2025

తం సూర్యం ప్రణమామ్యహమ్- ఆరోగ్య ప్రదాత సూర్యుని ఆరాధించే రథసప్తమి విశిష్టత ఇదే!

Ratha Saptami
Ratha Saptami (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 3, 2025, 12:56 PM IST

Ratha Saptami 2025 : ఏటా మాఘ మాసం శుద్ధ సప్తమిని రథసప్తమిగా జరుపుకుంటాం. ఆరోగ్య ప్రదాత, ప్రత్యక్ష దైవమైన సూర్యుని ఆరాధనకు విశేషంగా భావించే రథసప్తమి పండుగ సందర్భంగా అసలు రథ సప్తమిని ఎందుకు జరుపుకుంటాం? రథసప్తమి విశిష్టత ఏంటి? అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఆరోగ్య ప్రదాత సూర్య భగవానుడు
భూమిపై జీవరాసులు సుభిక్షంగా జీవించి ఉండడానికి కారణం సూర్యుడే. ఈ కారణంగానే సూర్యుని ప్రత్యక్ష దైవంగా భావించి పూజిస్తాం. హిందూ సంప్రదాయంలో సూర్యారాధనకు ఎంతో విశిష్టత ఉంది.

ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభం
తెలుగు పంచాంగం ప్రకారం, మాఘ మాస శుక్ల పక్షం సప్తమి తిథిని రథసప్తమి పర్వదినంగా జరుపుకుంటాం. మకర సంక్రాంతితో ఉత్తరాయణంలోకి ప్రవేశించే సూర్యుడు ఏడు గుర్రాలతో కూడిన రథంపై దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తాడని భక్తులు విశ్వసిస్తారు. మాఘ శుద్ధ సప్తమి నుంచి రానున్న ఆరు మాసాలు ఉత్తరాయణ పుణ్య కాలంగా పరిగణిస్తారు.

రథసప్తమి ఎప్పుడు?
ఈ ఏడాది మాఘ శుద్ధ సప్తమి ఫిబ్రవరి 4న ఉదయం 7:53 నుంచి మరుసటి రోజు ఉదయం 5:30 వరకు ఉంది. తిథి అనుసరించి ఫిబ్రవరి 4వ తేదీనే రథ సప్తమిగా జరుపుకోవాలని పంచాంగ కర్తలు సూచిస్తున్నారు. ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు పూజకు శుభ సమయం.

ఉత్తరాయణ పుణ్యకాలం
సూర్యుడు మాఘమాసంలో "అర్క'' నామంతో సంచరిస్తాడు. మాఘ అంటే పాపం లేనిది అని అర్థం. పుణ్యాన్ని ప్రసాదించే మాసం కాబట్టి ఈ మాసాన్ని మాఘమాసం అన్నారు. నిజానికి ఉత్తరాయణం మకర సంక్రాంతితో ఆరంభమైనా, రథసప్తమి నుంచే ఉత్తరాయణ స్ఫూర్తి పూర్తిగా గోచరిస్తుంది.

సూర్యుని రథానికి ఏడు గుర్రాలు ఎందుకంటే!
సూర్యుని రథానికి ఉండే ఏడు గుర్రాలు ఏడు వారాలకు సంకేతాలని అంటారు. గాయత్రి, త్రిష్ణుప్, జగతి అనుష్టుప్, పంక్తి, బృహతి, ఉష్ణిక్ అనే ఏడు గుర్రాల రథంపై భానుడు స్వారీ చేస్తూ మేషం నుంచి మీనం వరకు ఉన్న పన్నెండు రాశుల్లో ప్రయాణిస్తారు. ఈ 12 రాశులను పూర్తి చేయడానికి సూర్య రథానికి ఏడాది సమయం పడుతుంది. రథసప్తమి అంటే సూర్యజయంతి కాదు. సూర్యుడు రథాన్నెక్కి సాగించే ప్రయాణం ఈ రోజు నుంచి మొదలవుతుంది.

రథసప్తమి పూజా విధానం
రథ సప్తమి నాడు ముంగిట్లో రథం ముగ్గులు ఎంతో సుందరంగా వేస్తారు. అప్పటికే ధాన్యరాశులు ఇళ్లకు చేరి ఉండటం వల్ల ఉదయాన్నే ఇంటిల్లీ పాది స్నానాలు చేసి సూర్యుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు.

జిల్లేడు ఆకులతో స్నానం
సూర్యునికి అర్క పత్రాలంటే ప్రీతి. అర్క అంటే జిల్లేడు అని అర్థం. రథసప్తమి రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి శుచియై, 9 జిల్లేడు ఆకులు తీసుకుని రెండు భుజాలపైన, శిరస్సు పైన మూడు చొప్పున జిల్లేడు ఆకులు ఉంచి వాటిపై కొద్దిగా బియ్యం కూడా ఉంచి తల స్నానం చేయాలి. ఈ విధంగా స్నానం చేయడం వలన దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోయి చక్కని ఆరోగ్యం చేకూరుతుందని విశ్వాసం.

ప్రత్యక్ష భగవానుని ఇలా పూజించాలి?
ఇంట్లో నిత్య పూజాదికాలు పూర్తి చేసుకున్న తరువాత సూర్యుని వెలుగు నేరుగా ప్రసరించే ప్రదేశంలో పూజ నిర్వహించాలి. తులసి కోట సమీపంలో కానీ మిద్దె మీద కానీ ఈ పూజ చేసుకుంటే మంచిది. ముందుగా పూజ చేసే ప్రదేశాన్ని నీటితో శుభ్రం చేసి భూశుద్ధి చేసుకోవాలి. అనంతరం వరి పిండితో రథం ముగ్గు వేయాలి. ఈ ముగ్గును పసుపు కుంకుమలతో, ఎర్రని పువ్వులతో అలంకరించాలి.

పరమాన్నం తయారీ
ఒక కొత్త పాత్రలో ఆవు పాలు పొంగించి అందులో పిడికెడు బియ్యం వేసి బియ్యం మెత్తగా అయ్యేవరకు ఉడికించి, తరువాత బెల్లం, ఆవు నెయ్యి వేసి పరమాన్నం సిద్ధం చేసుకోవాలి. వీలుంటే ఈ పరమాన్నం సూర్యుని సమక్షంలో వండితే ఇంకా మంచిది.

అర్ఘ్యం
ఒక రాగి పాత్రలో నీరు తీసుకొని అందులో తులసి దళాలు, ఎర్రని పువ్వులు వేసి ధారగా నీరు వంపుతూ సూర్య భగవానునికి అర్ఘ్యం ఇవ్వాలి. అనంతరం 12 సార్లు సూర్య నమస్కారాలు చేయాలి. సూర్యునికి ధూప దీపాలు దర్శనం చేయించాలి. సూర్యుని సమక్షంలో ఆదిత్య హృదయం పారాయణ విధిగా చేయాలి.

చిక్కుడు ఆకులలో నైవేద్యం
ముందుగా తయారు చేసుకున్న పరమాన్నాన్ని చిక్కుడు ఆకులలో ఉంచి సూర్యునికి నివేదించాలి. అరటిపండ్లు, కొబ్బరికాయ సమర్పించాలి. చివరగా మంగళ హారతి ఇవ్వాలి.

ఈ దానాలు శ్రేష్ఠం
రథసప్తమి రోజు శాస్త్రోక్తంగా పూజ చేసుకున్న తర్వాత సద్బ్రాహ్మణులకు ఛత్రం, జలపాత్ర, చెప్పులు, మంచినీరు, నూతన వస్త్రాలు దానం చేయాలి. ఈ విధంగా రథసప్తమి పూజను శాస్త్రోక్తంగా చేసుకుంటే ఆ సూర్య భగవానుని అనుగ్రహంతో ఆయురారోగ్య ఐశ్వర్యాలు లభిస్తాయని విశ్వాసం.

ఓం ఆదిత్యాయ నమః

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.