TDP Leaders Celebrations in Hyderabad : చంద్రబాబుకు బెయిల్.. హైదరాబాద్‌లో పార్టీ కార్యకర్తలు, అభిమానుల సంబురాలు - హైదరాబాద్‌లో చంద్రబాబుకు పాలాభిషేకం
🎬 Watch Now: Feature Video
Published : Oct 31, 2023, 1:48 PM IST
TDP Leaders Celebrations in Hyderabad : టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు స్కిల్ డెవలప్మెంట్ కేసు(Skill Development Case)లో ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. దీంతో హైదరాబాద్లోని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ భవన్ ఎదుట బాణా సంచా కాలుస్తూ జై బాబు.. జైజై బాబు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. టీడీపీ నాయకులు చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం(Chandrababu Palabhishekam) చేశారు. న్యాయం గెలిచిందని.. ఇది తొలి విజయంగా భావిస్తున్నామని నేతలు చెబుతున్నారు. సుప్రీం కోర్టులోని క్వాష్ పిటిషన్ విషయంలో మచ్చలేకుండా బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు.
సెప్టెంబర్ 9న నంద్యాలలో చంద్రబాబు నాయుడును పోలీసులు అరెస్టు చేయగా.. 52 రోజుల పాటు ఆయన రాజమండ్రి జైలులో ఉన్నారు. తాజాగా పలు షరతులు విధిస్తూ ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. నవంబర్ 28 సాయంత్రం 5లోగా రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ వద్ద సరెండర్ కావాలని తీర్పునిచ్చింది.