క్యూట్ డ్యాన్స్‌తో అదరగొడుతున్న చిన్నారి.. సోషల్ మీడియాలో లక్షకుపైగా ఫాలోవర్స్ - రెండేళ్ల చిన్నారి స్వర వైరల్ డ్యాన్స్ వీడియోలు
🎬 Watch Now: Feature Video
Viral Kid Dance : తన ముద్దులొలికే డ్యాన్స్‌లతో అదరగొడుతోంది ఓ చిన్నారి. వివిధ వేషధారణల్లో డ్యాన్స్‌లు చేస్తూ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఆమె వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. దీంతో ఇన్‌స్టాగ్రామ్‌లో లక్ష మందికి పైగా ఫాలోవర్లను సంపాదించింది ఈ చిట్టి డ్యాన్సర్. ఆమెనే మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా శిర్డీకి చెందిన రెండేళ్ల చిన్నారి స్వర.
ఇదీ జరిగింది.. శిర్డీలోని సాయినాథ్ సెకండరీ స్కూల్ రిటైర్డ్ టీచర్ కిషోర్ కదమ్ రెండేళ్ల మనవరాలు స్వర. కిషోర్ కదమ్ ఉపాధ్యాయుడిగా పనిచేసేటప్పుడు అబ్బాయిలకు, అమ్మాయిలకు డ్యాన్స్ నేర్పించేవారు. శిర్డీ సంస్థాన్‌లో జరిగే ముఖ్యమైన పండుగలకు చిన్న పిల్లలతో రాముడు, కృష్ణుడు, హనుమంతుడు, రాధగా వేషాలు వేయించి.. డ్యాన్స్ చేయించేవారు. అలాగే తన మనవరాలికి కూడా వివిధ వేషధారణతో డ్యాన్స్ చేయించారు. చిన్నారి తన చిట్టి చిట్టి పాదాలతో చేసే డ్యాన్స్‌ను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే, చాలా మంది తమ పిల్లల వీడియోలు సోషల్ మీడియాలో పెడుతున్నా.. స్వర వీడియోలు మాత్రం వైరల్ అయ్యాయని ఆమె తల్లి చెప్పింది. అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో స్వర కనిపిస్తోందని.. అది తమకు ఆనందాన్ని కలిగిస్తోందని ఆమె తెలిపింది. ప్రస్తుతం స్వరాకు ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.
Ashadi Ekadashi 2023 Marathi : ఆషాది ఏకాదశి కోసం పాండురంగగా దుస్తులు ధరించి స్వర చేసిన డ్యాన్స్ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.