ETV Bharat / state

తెలంగాణలో నేడు పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు - HOLIDAY FOR SCHOOLS IN TELANGANA

మన్మోహన్‌సింగ్‌ మృతి పట్ల వారం పాటు సంతాప దినాలు ప్రకటించిన ప్రభుత్వం - నేడు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు

holiday for schools in telangana
holiday for schools (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 16 hours ago

Updated : 16 hours ago

Holiday for Schools in Telangana : మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ తీవ్ర అస్వస్థతతో దిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ గురువారం రాత్రి కన్నుమూశారు. ఆయన మృతి పట్ల ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు సంతాపం తెలుపుతున్నారు. ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మన్మోహన్‌ సింగ్‌పై రాష్ట్రానికి చెందిన పలువురు నేతలు సంతాపం ప్రకటించారు. మన్మోహన్ మృతితో దేశం గొప్ప కుమారుడిని కోల్పోయిందని సీఎం రేవంత్‌ రెడ్డి ఎక్స్‌లో పేర్కొన్నారు. దేశం గొప్ప ఆర్థిక సంస్కర్తని కోల్పోయిందన్న ఆయన, రాజకీయ, ప్రజా జీవితానికి మర్యాద ఎంత అవసరమో చూపించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. దేశ రాజకీయాల్లో ఓ లెజెండ్‌ అని, దేశం కోసం నిష్కళంకమైన, సమగ్రమైన నిర్ణయాలు తీసుకున్నారని పేర్కొన్నారు. మన్మోహన్‌ మృతిపై శాసనసభ స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌, మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా పలువురు మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌ గౌడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

మన్మోహన్ సింగ్ మరణంపై బీఆర్​ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ఆయన మంత్రివర్గంలో కేంద్రమంత్రిగా పని చేసినప్పుడు మన్మోహన్‌తో ఉన్న అనుబంధాన్ని కేసీఆర్‌ గుర్తు చేసుకున్నారు. ఆర్థిక సంస్కరణల అమలులో ఎంతో దార్శనికతను ప్రదర్శించారని కొనియాడిన కేసీఆర్‌, మన్మోహన్‌ హయాంలోనే రాష్ట్ర ఏర్పాటు జరగడం చారిత్రక సందర్భమని పేర్కొన్నారు. మాజీ ప్రధాని మృతిపై కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు సంతాపం తెలిపారు. మేధావి, మితభాషి, సౌమ్యుడు, స్థితప్రజ్ఞత కలిగిన నేతగా పేరు తెచ్చుకున్న మన్మోహన్ సింగ్ యువ తరానికి ఆదర్శమని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

నేడు సెలవు : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా 7 రోజుల పాటు సంతాప దినాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నేడు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. వారం రోజులు సంతాప దినాలను పాటించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

1991 నుంచి 1996 వరకు పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పని చేసిన మన్మోహన్‌ సింగ్‌, దేశ ఆర్థిక సంస్కరణల్లో కీలక పాత్ర పోషించారు. ఆర్థిక వ్యవస్థపై చెరగని ముద్ర వేశారు. 2004 నుంచి 2014 వరకు పదేళ్ల పాటు భారత ప్రధానిగా దేశానికి సేవలందించిన ఆయన, సుదీర్ఘ కాలం పాటు పాలించిన ప్రధానుల్లో ఒకరిగా నిలిచారు.

Last Updated : 16 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.