ETV Bharat / technology

ఓలా నుంచి రెండు ఎలక్ట్రిక్ బైక్​లు- సింగిల్ ఛార్జ్​తో 501కి.మీ రేంజ్​! - OLA ROADSTER X AND X PLUS LAUNCHED

మార్కెట్​లో ఓలా ఇ-మోటార్​సైకిల్స్ సేల్స్ స్టార్ట్- ధర, ఫీచర్లు, రేంజ్ వివరాలు ఇవే!

Ola Roadster X
Ola Roadster X (Photo Credit- Ola Electric)
author img

By ETV Bharat Tech Team

Published : Feb 5, 2025, 4:20 PM IST

Ola Roadster X and X+ Launched: ప్రముఖ విద్యుత్ టూ-వీలర్ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ నుంచి రెండు ఇ-మోటార్​సైకిల్స్ మార్కెట్​లోకి ఎంట్రీ ఇచ్చాయి. కంపెనీ 'రోడ్​స్ట్​ర్ X', 'రోడ్​స్టర్ X+' పేరుతో ఈ రెండు ఎలక్ట్రిక్ బైక్స్​ బుకింగ్స్​ను ఇవాళ ప్రారంభించింది. దీంతో ఇప్పటి వరకూ ఎలక్ట్రిక్ స్కూటర్​లను మాత్రమే విక్రయిస్తున్న సంస్థ ఇప్పుడు ఈవీ మోటార్​సైకిల్ విభాగంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా వీటి రేంజ్, ధర, ఫీచర్ల వివరాలు మీకోసం.

'ఓలా రోడ్​స్టర్ X' బ్యాటరీ అండ్ పవర్​ ట్రెయిన్: ఈ కొత్త 'ఓలా రోడ్​స్టర్ X' ఎలక్ట్రిక్ మోటార్​సైకిల్ మూడు బ్యాటరీ ఆప్షన్​లను కలిగి ఉంటుంది.

  • 2.5 kWh
  • 3.5 kWh
  • 4.5 kWh

ఇవి 9.38 HP గరిష్ఠ శక్తిని ఉత్పత్తి చేస్తాయి.

దీని 2.5 kWh బ్యాటరీ వేరియంట్ 105 km/h టాప్​ స్పీడ్​ను కలిగి ఉంటుంది. ఇది కేవలం 3.4 సెకన్లలో 0 - 40 km/h వేగాన్ని అందుకుంటుంది. ఇది సింగిల్ ఛార్జ్​తో 140 కి.మీ రేంజ్​ను అందిస్తుందని సమాచారం.

ఇక దీని 3.5 kWh, 4.5 kWh రెండు బ్యాటరీ వేరియంట్‌లూ 118 km/h గరిష్ఠ వేగాన్ని అందిస్తాయి. ఇవి కేవలం 3.1 సెకన్లలో దీన్ని పూర్తి చేస్తాయి. వీటిలో 3.5 kWh బ్యాటరీ వేరియంట్​ సింగిల్ ఛార్జ్​తో 196 కి.మీ, 4.5 kWh బ్యాటరీ వేరియంట్ 252 కి.మీ చొప్పున రేంజ్​ను అందిస్తాయని కంపెనీ చెబుతోంది.

'ఓలా రోడ్​స్టర్ X+' బ్యాటరీ అండ్ పవర్​ ట్రెయిన్: ఈ 'ఓలా రోడ్​స్టర్ X+' ఇ-మోటార్​సైకిల్ రెండు బ్యాటరీ వేరియంట్​లను కలిగి ఉంది. ఇవి గరిష్ఠంగా 14.75 HP పవర్ అవుట్‌పుట్‌ను అందిస్తాయి. ఈ బైక్ టాప్​ స్పీడ్​ 125 km/h. ఇది కేవలం 2.7 సెకన్లలో 0 నుంచి 40 km/h వేగాన్ని అందుకుంటుంది.

  • 4.5 kWh
  • 9.1 kWh

ఇక ఓలా రోడ్‌స్టర్ X+ మోడల్ 4.5 kWh బ్యాటరీ వేరియంట్ 252 కి.మీ రేంజ్, 9.1 kWh బ్యాటరీ వేరియంట్ 501 కి.మీ రేంజ్​ను అందిస్తుందని ఓలా చెబుతోంది.

ఓలా రోడ్‌స్టర్ X అండ్ రోడ్‌స్టర్ X+ ఫీచర్లు:

ఓలా రోడ్‌స్టర్ X: ఈ కొత్త 'రోడ్‌స్టర్ X' మోడల్ స్పోర్ట్స్, నార్మల్, ఎకో అనే మూడు రైడింగ్ మోడ్‌లను కలిగి ఉంది. ఇందులో స్మార్ట్ కనెక్టివిటీతో 4.3 అంగుళాల LCD కలర్ సెగ్మెంటెడ్ డిస్‌ప్లే, MoveOS 5 ద్వారా ఆధారితమైన USB వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఓలా రోడ్‌స్టర్ X+: రోడ్‌స్టర్ X+ కూడా రోస్టర్ X మాదిరిగానే అదే ఫీచర్లతో వస్తుంది. అయితే ఇందులో USBతో 4.3 అంగుళాల సెగ్మెంటెడ్ LCD స్క్రీన్​ను అమర్చింది. దీంతోపాటు ఎనర్జీ ఇన్​సైట్స్, అడ్వాన్స్డ్​ రీజెన్, క్రూయిజ్ కంట్రోల్, రివర్స్ మోడ్ వంటి అనేక రకాల డిజిటల్ టెక్ ఫీచర్‌లను కూడా అందించింది.

ఓలా రోడ్​స్టర్ X, రోడ్‌స్టర్ X+ ధరలు:

ఓలా రోస్టర్ X:

  • కంపెనీ రోడ్​స్టర్ X సిరీస్​ను రూ. 74,999 (ఎక్స్-షోరూమ్) ధరతో ప్రారంభించింది. అంటే ఇది దీని 2.5 kWh బ్యాటరీ వేరియంట్ ధర.
  • దీని 3.5 kWh బ్యాటరీ వేరియంట్ ధర: రూ. 84,999 (ఎక్స్- షోరూమ్)
  • ఇక దీని 4.5 kWh బ్యాటరీ వేరియంట్ ధర: రూ. 95,999 (ఎక్స్- షోరూమ్)

ఓలా రోడ్​స్టర్ X+:

  • రోడ్​స్టర్​ X+ మోడల్ 4.5kWh బ్యాటరీ వేరియంట్ ధర: రూ. 1,04,999 (ఎక్స్-షోరూమ్)
  • దీని 9.1kWh వేరియంట్​ ధర: రూ. 1,54,999 (ఎక్స్-షోరూమ్)

డెలివరీలు ఎప్పటి నుంచి?: దేశీయ మార్కెట్​లో వీటి డెలివరీలు మార్చి నెల మధ్యలో (మిడ్-మార్చి) నుంచి ప్రారంభమవుతాయని ఓలా పేర్కొంది.

గ్లోబల్ మార్కెట్​లోకి మొట్ట మొదటి ట్రై ఫోల్డ్ ఫోన్!- మరి భారత్​లో కూడా ఎంట్రీ ఇస్తుందా?

అందరికీ అదే ఫోన్ కావాలట- ప్రపంచంలోనే నంబర్​ వన్​గా ఐఫోన్ 15!

చాట్​జీపీటీలో కొత్త ఏఐ టూల్- ఇది డీప్​సీక్​కు చెక్​ పెట్టనుందా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.