కొత్త పార్లమెంట్ ఆకృతిలో బంగారు చెవి రింగులు, ఉంగరాలు.. మోదీ ఫొటోతో 3D డైమండ్ లాకెట్!
🎬 Watch Now: Feature Video
గుజరాత్.. సూరత్‌కు చెందిన ప్రముఖ ఆభరణాల తయారీ సంస్థ సోనియో.. కొత్త పార్లమెంట్ భవన ఆకృతిలో బంగారు చెవి రింగులు, ఉంగరాలను తయారు చేసి విక్రయిస్తోంది. ప్రధాని మోదీ ఫొటోతో డైమండ్ లాకెట్‌ను తయారు చేసి అమ్ముతోంది. వీటితోపాటు వెండితో పార్లమెంట్ నమూనాను రూపొందించింది. వీటి గురించి తెలుసుకున్న సూరత్ ప్రజలు.. ఈ వినూత్న ఆభరణాలను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
కొత్త పార్లమెంట్ ఆకృతిలో తయారు చేసిన బంగారు చెవి రింగులు, ఉంగరాలకు విలువైన వజ్రాలను కూడా పొదిగింది సోనియో కంపెనీ. మోదీ డైమండ్ లాకెట్‌పై ప్రధాని చిత్రాన్ని 3డీ ప్రింట్‌ను ఉపయోగించి ముద్రించింది. దీనిపై 'ది లెజెండ్' అనే చెక్కింది. రెండున్నర అంగుళాల పొడవు ఉన్న ఆ లాకెట్‌కు బాగా డిమాండ్ ఉందని చెబుతోంది.
ఈ వినూత్న ఆభరణాల వివరాలను సూరత్ జ్యువెలరీ తయారీదారుల సంఘం అధ్యక్షురాలు జయంతి సన్వాలియా వెల్లడించారు. "త్రిభుజాకార రూపంలో కొత్త పార్లమెంట్‌ను కేంద్రం నిర్మించింది. ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. అందుకే ప్రజాస్వామ్య దేవాలయంగా పరిగణించే కొత్త పార్లమెంట్ భవన నమూనాను బంగారం, వెండితో భారత ప్రజల కోసమే తయారు చేశాం. కొత్త పార్లమెంట్ ఆకృతిలో తయారు చేసిన ఉంగరాలు, చెవి రింగుల బరువు 2 గ్రాముల నుంచి 200 గ్రాముల వరకు ఉంటాయి" అంటూ జయంతి చెప్పుకొచ్చారు.
సూరత్‌కు చెందిన మరో ప్రముఖ వ్యాపారవేత్త రోహన్ షా కూడా మీడియాతో మాట్లాడారు. "ఇటీవలే ప్రధాని మోదీ.. కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించారు. అందుకే పార్లమెంట్ నమూనాను రూపొందించాలనే ఆలోచన మాకు వచ్చింది. ఈ వెండి పార్లమెంట్ నమూనా.. భారతీయ సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తుంది. దేశీయ మార్కెట్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్‌లోనూ దీన్ని ప్రదర్శించబోతున్నాం. మోదీ డైమండ్ లాకెట్‌కు చాలా డిమాండ్ ఉంది" అంటూ రోహన్ చెప్పుకొచ్చారు.
New Parliament Inauguration : గత నెల 28వ తేదీన.. దిల్లీలో అధునాతన సదుపాయాలు, సకల హంగులు, సనాతన కళాకృతులతో నిర్మించిన నూతన పార్లమెంటు భవంతి ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ఏక్‌భారత్.. శ్రేష్ఠ భారత్ స్ఫూర్తి పరిఢవిల్లేలా నిర్మించిన ప్రజాస్వామ్య నవ్య సౌధాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. లోక్‌సభ స్పీకర్ స్థానానికి సమీపంలో చారిత్రక రాజదండం సెంగోల్‌ను ప్రతిష్ఠాపన చేశారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.