Young Man Died While Swimming Talakona Waterfall: రీల్స్ వీడియో చేస్తూ.. యువకుడు మృత్యువాత! - తిరుపతి జిల్లా తలకోన జలపాతం లేటెస్ట్ న్యూస్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 1, 2023, 7:49 PM IST

Updated : Jul 1, 2023, 8:07 PM IST

Young Man Died While Swimming Talakona Waterfall: రీల్స్ వీడియో ఓ యువకుడి ప్రాణాలను బలికొంది. తిరుపతి జిల్లాలో ప్రకృతి అందాలకు నిలయమైన తలకోన జలపాతం వద్ద విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. విహారం కోసం వెళ్లిన యాత్ర.. విషాదకరంగా ముగిసింది. స్నేహితుడితో కలిసి జలపాతాన్ని చూసేందుకు వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు బండరాళ్ల మధ్యలో చిక్కుకుని మృత్యువాత పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక రాష్ట్రం మంగళూరుకు చెందిన సుమంత్(23) అనే యువకుడు చెన్నైలో రాజీవ్ గాంధీ కళాశాలలో ఎంఎస్సీ చదువుతున్నాడు. కాగా.. అతడు తిరుపతికి చెందిన తన సహ విద్యార్థితో కలిసి.. శుక్రవారం తలకోన పర్యటనకు వెళ్లాడు. స్నేహితులిద్దరూ అక్కడ జలకాలాడారు. ఈ క్రమంలో సుమంత్ ఎత్తు నుంచి నీటిమడుగులోకి తలకిందులుగా దూకుతానని, తన స్నేహితుడిని అది వీడియో తీయమని చెప్పాడు. అయితే అతడు నీటిలోకి తలకిందులుగా దూకి.. అడుగుభాగాన ఉన్న బండ రాళ్ల మధ్యలో ఇరుక్కుపోయాడు. నీటిలోకి వెళ్లిన సుమంత్ ఎంతసేపైనా బయటకు రాకపోయేసరికి అతడి స్నేహితుడు ఆందోళన చెందాడు. కొద్దిసేపటి తర్వాత.. సుమంత్ నీటి అడుగుభాగాన బండరాళ్ల మధ్యలో ఇరుక్కుపోవటాన్ని అతడు గమనించాడు. వెంటనే అతడు సమాచారాన్ని పోలీసులకు అందజేశాడు. యర్రవారిపాల్యం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతుడిని బయటకు తీసే ప్రయత్నాలు చేశారు. అప్పటికే చీకటిపడటంతో పోలీసులు.. శనివారం సుమంత్ మృతదేహాన్ని వెలికి తీస్తామని మీడియాకు తెలిపారు. ఈరోజు ఉదయాన్నే పోలీసులు మృతదేహాన్ని వెలికి తీశారు. కాగా.. తలకోన జలపాతం వద్ద ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉంటాయి. ఇలా ఈ ఏడాది ముగ్గురు యువకులు జలపాతంలో మునిగి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. జలపాతం వద్ద అటవీ శాఖ అధికారులు.. పర్యాటలకు తగిన రక్షణ కల్పిస్తున్నా.. వారి కళ్లుగప్పి కొందరు యువకులు జలపాతంలో విన్యాసాలు చేస్తూ ఇలా మృత్యువాత పడుతున్నారు.

Last Updated : Jul 1, 2023, 8:07 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.