Stomach Pain After Eating : తిన్న వెంటనే కడుపులో నొప్పిగా ఉందా? అల్సర్ కారణమా? తగ్గాలంటే ఏం చేయాలి?
🎬 Watch Now: Feature Video
Stomach Pain After Eating Reasons : కొందరికి తిన్న వెంటనే కడుపులో నొప్పిగా అనిపిస్తుంటుంది. ఇలా జరగడానికి ప్రధాన కారణం అల్సర్ వ్యాధి అయి ఉండవచ్చని అంటున్నారు డాక్టర్.రోహన్ పీ రెడ్డి. ఈ సమయాల్లో సాధారణంగా వైద్యులను సంప్రదించి వారు సూచించే మందులను వాడితే తగ్గిపోతుంది. అప్పటికీ నొప్పి తగ్గకుండా అలాగే పునరావృతం అవుతోందంటే పొట్ట భాగాన్ని ఎండోస్కోపీ టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇలా ఎండోస్కోపీ ద్వారా అల్సర్ అనేది దేని కారణంగా వచ్చిందని సులువుగా అంచనా వేయవచ్చు. అయితే అల్సర్స్ రావడానికి ముఖ్యమైన కారణం కడుపులో సాధారణంగా ఉండే హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ అని చెబుతున్నారు గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ రోహన్ పీ రెడ్డి. దీనితో పాటు సమయానికి సరైన ఆహారం తీసుకోకపోవడం, ఒత్తిడికి లోనవ్వడం వల్ల కూడా అల్సర్స్ వస్తాయని అంటున్నారు వైద్యులు. హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చే అల్సర్స్ 10 నుంచి 14 రోజుల వరకు తీసుకునే యాంటిబయాటిక్స్ ద్వారా తగ్గిపోతాయి. కానీ, మనం ఇష్టారీతిన వాడే పెయిన్ కిల్లర్స్ మూలాన కూడా పొట్టలో అల్సర్స్ వచ్చే ప్రమాదముందంటున్నారు వైద్యులు.