స్కూటీలో దూరిన ఏడు అడుగుల పాము- వర్షాలకు వచ్చి డూమ్‌లో నక్కి! - తమిళనాడులో స్కూటీ ముందుభాగంలో దూరిన పాము
🎬 Watch Now: Feature Video


Published : Dec 12, 2023, 7:54 AM IST
|Updated : Dec 12, 2023, 8:05 AM IST
Snake In Scooty In Tamil Nadu : ఏడు అడుగుల పొడవైన పాము ఓ స్కూటీలో ప్రత్యక్షమై తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన తమిళనాడులోని చెన్నైలో జరిగింది. పార్క్ చేసిన స్కూటీ ముందు భాగంలో దూరింది పాము. దీనిని గమనించిన యజమాని సహాయ సిబ్బందికి సమాచారం అందించాడు. అక్కడికి చేరుకున్న సిబ్బంది తీవ్రంగా శ్రమించి పామును బయటకు తీసి కాపాడారు. ఆ తర్వాత పామును ఓ సంచిలో పెట్టుకుని తీసుకెళ్లి అడవిలో వదిలిపెట్టారు. ఇటీవల వచ్చిన తుపాను కారణంగా కురిసిన భారీ వర్షాల కారణంగా కొట్టుకునివచ్చి ఇలా స్కూటీలో దూరి ఉంటుందని సిబ్బంది భావిస్తున్నారు.
స్కూటీలో దూరిన కొండచిలువ
గతంలోనూ ఇలాంటి ఘటనే ఛత్తీస్‌గడ్‌లోనూ జరిగింది. మనేంద్రగఢ్ భరత్‌పుర్ చిర్మిరి జిల్లాలో కొండచిలువ ఓ స్కూటీలోకి దూరి కలకలం సృష్టించింది. రెస్క్యూ బృందం చాలా సమయం శ్రమించి స్కూటీ భాగాలను విడదీసి కొండచిలువను బయటకు తీసింది. దానిని కారులో తీసుకెళ్లి అడవిలో వదిలేశారు. ఈ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి