సపోర్ట్ లేకున్నా సలార్‌లో అవకాశం - జూనియర్ వరదరాజ మన్నార్ ఇంటర్వ్యూ - సలార్ సినిమా యువ నటుడు కార్తికేయ స్టోరీ
🎬 Watch Now: Feature Video
Published : Dec 26, 2023, 10:59 AM IST
Salaar Child Artist Karthikeya Dev Interview : ఆ కుర్రాడు పదో తరగతి చదువుతున్నాడు. సినిమాలంటే మహా ఇష్టం. తల్లిదండ్రులను ఒప్పించి మోడలింగ్ చేశాడు. దర్శకుల దృష్టిలో పడ్డాడు. సిన్ కట్ చేస్తే. సలార్ లాంటి ఓ భారీ చిత్రంలో అవకాశాన్ని అందుకున్నాడు. తన నటనతో చిచ్చర పిడుగులా చెలరేగిపోయాడు. ప్రశాంత్ నీల్ లాంటి అగ్ర దర్శకుడి ప్రశంసలందుకుని జూనియర్ వరదరాజ మన్నార్‌గా తెరపై రాజసాన్ని ప్రదర్శించాడు. మరి, ఎలాంటి సినిమా నేపథ్యం లేకున్నా ఇంత భారీ సినిమాలో నటించే అవకాశం ఎలా వచ్చిందో ఆ బాలనటుడు కార్తికేయనే అడిగి తెలుసుకుందాం.
Salaar movie child Artist Special Story : ''మా సొంతూరు ప్రకాశం జిల్లా రాజపాలం. అమ్మ నాన్న వాళ్లు నా చిన్నప్పటి నుంచి హైదరాబాద్‌లో ఉంటున్నారు. నేను హైదరాబాద్‌లోనే చదువుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇష్టం. అమ్మ నాన్న ప్రోత్సాహంతోనే యాక్టింగ్ పీల్డ్కు వచ్చాను. సినిమా వాళ్ల నుంచి నాకు ఎలాంటి సపోర్ట్ లేదు. సలార్ సినిమాకి బాల నటుడు కావాలని తెలవడంతో నా పోటోలు తీసి పంపించాను. దర్శకుడు నీల్ నా యాక్టింగ్ చూసి సినిమాలో తీసుకున్నారు. వరదరాజ మన్నార్ అనే మెయిన్ రోల్ రావడం నా అదృష్టం.'' అంటూ సలార్ సినిమా బాల నటుడు కార్తికేయ వివరించారు.