ఎంపీ VS ఎమ్మెల్యే.. చెప్పుల విషయంలో వివాదం.. రివాబా జడేజా రిప్లై ఇదే.. - rivaba jadeja poonamben maadam dispute
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17-08-2023/640-480-19291488-thumbnail-16x9-rivaba--jadeja--poonamben--maadam--dispute.jpg)
Rivaba Jadeja Poonamben Maadam Dispute : గుజరాత్.. జామ్‌నగర్ నార్త్ బీజేపీ ఎమ్మెల్యే రివాబా జడేజా, ఎంపీ పూనంబెన్ మధ్య వాగ్వాదం జరిగింది. అమరవీరులకు నివాళులర్పించే కార్యక్రమంలో పాల్గొన్న వీరిద్దరూ గొడవకు దిగారు. రివాబా చెప్పులు విప్పి.. అమరవీరులకు నివాళులర్పించడంపై ఎంపీ పూనంబెన్ విమర్శించారు. ప్రధాని, రాష్ట్రపతి కూడా చెప్పులు విప్పి నివాళులర్పించని అన్నారు. ఈ క్రమంలో పూనంబెన్పై రివాబా అసంతృప్తి వ్యక్తం చేశారు.
'ఎంపీ పూనంబెన్ అమరవీరులకు చెప్పులు వేసుకుని నివాళులర్పించారు. నేను చెప్పులు విప్పి అమరవీరులకు నివాళులర్పించాను. అలాంటి కార్యక్రమాల్లో ప్రధాని, రాష్ట్రపతి కూడా చెప్పులు తీయరని.. కొందరు అమాయకులు మాత్రమే చెప్పులు తీసి నివాళులర్పిస్తారని పూనంబెన్ అన్నారు. ఆమె వ్యాఖ్యలు నాకు నచ్చలేదు. అందుకే ఆత్మగౌరవంతో మాట్లాడాను. చెప్పులు విప్పి నివాళులర్పించి నేను తప్పు చేశానా?' అని జామ్‌నగర్ నార్త్ ఎమ్మెల్యే రివాబా జడేజా అన్నారు.
గతేడాది జరిగిన గుజరాత్ ఎన్నికల్లో రవీంద్ర జడేజా సతీమణి రివాబా భారీ ఆధిక్యంతో గెలుపొందారు. జామ్‌నగర్ నార్త్‌లో బీజేపీ తరపున పోటీ చేసిన రివాబా.. సమీప ప్రత్యర్థి ఆప్‌కు చెందిన కర్షన్ కర్మూర్పాపై 61వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.