ఇంట్లో మరిచిపోయిన ల్యాప్​టాప్ తీసుకొచ్చేందుకు ర్యాపిడో బుక్ చేస్తే - డ్రైవర్ భలే షాకిచ్చాడుగా? - Rapido Driver Laptop Threat

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Jan 18, 2024, 1:02 PM IST

Rapido Driver Laptop Hyderabad : అతనో బ్యాంక్​​ ఉద్యోగి. హడావుడిగా ఉద్యోగ నిమిత్తం బ్యాంక్​కు వెళ్లాడు. బ్యాంక్​కు చేరాక తన ల్యాప్​టాప్​ అవసరం ఏర్పడింది. తాను తిరిగి ఇంటికి వెళ్తే సమయం వృధా అని భావించి ర్యాపిడో ద్వారా ఇంట్లో మర్చిపోయిన ల్యాప్​టాప్​ తెప్పిస్తే సరే అని భావించాడు. వెంటనే ర్యాపిడో బుక్ చేశాడు. ర్యాపిడో డ్రైవర్ తన ఇంటికి వెళ్లి ల్యాప్​టాప్ తీసుకున్నాడు. రెండు మూడు గంటలైనా ఇంకా ల్యాప్​టాప్ డెలివరీ చేయకపోవడంతో అనుమానమొచ్చి డ్రైవర్​కు కాల్ చేశాడు. అప్పుడు డ్రైవర్ ఇచ్చిన షాక్​తో కంగుతినడం అతడి వంతైంది. ఇంతకీ ఏం జరిగిందంటే?

Rapido Driver Laptop Destruction Threat : హైదరాబాద్​లోని మాసబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ పరిధిలో అశ్విన్ అనే వ్యక్తి ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఉదయం ఆఫీస్​కు వెళ్లిన తర్వాత తాను ఇంట్లో ల్యాప్​టాప్​ మర్చిపోయిన సంగతిని గమనించి రాపిడో ద్వారా ల్యాప్​టాప్​ను తెప్పించడానికి బైక్​ బుక్ చేశాడు. అయితే డెలివరీ బాయ్ ఇంటికి వెళ్లి ల్యాప్​టాప్ తీసుకున్నాడు. ఎంతసేపయినా ల్యాప్​టాప్ డెలివరీ చేయకపోవడంతో అశ్విన్​ డ్రైవర్​కు కాల్ చేయగా అతడు ప్లేట్ ఫిరాయించి షాక్ ఇచ్చాడు.

ల్యాప్​టాప్ కావాలంటే 30 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అడిగిన డబ్బు ఇవ్వకపోతే ల్యాప్​టాప్​లో ఉన్న డేటాను డిలీట్ చేస్తానని బెదిరించాడు. ఏం చేయాలో పాలుపోని అశ్విన్ మొదట షాకయ్యాడు. ఆ తర్వాత తేరుకుని పోలీసులను సంప్రదించగా సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితుణ్ని పట్టుకున్నారు. అతడిని అదుపులోకి తీసుకుని రిమాండ్​కు తరలించారు. నిందితుడు ఏపీకి చెంది గోవర్ధన్​ రెడ్డిగా పోలీసులు గుర్తించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.