సిమెంట్ ఫ్యాక్టరీల వద్ద సింహాల సంచారం.. ఆహారం కోసం వచ్చి చివరకు.. - సింహాలు వీడియో
🎬 Watch Now: Feature Video

గుజరాత్లోని అమ్రేలీ జిల్లాలో సింహాలు బహిరంగంగా సంచరించడం ఆందోళన రేకెత్తిస్తోంది. కోవయా ప్రాంతంలోని రాజులాలో ఉన్న పారిశ్రామికవాడలో ఐదు సింహాలు తిరుగుతూ కనిపించాయి. సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్న ఈ ప్రాంతంలో సింహాలు తిరుగుతున్న చిత్రాలను కొందరు ఫోన్లలో బంధించారు. ఆహారం దొరుకుతుందన్న ఆశతో సింహాలు అక్కడికి వచ్చి ఉంటాయని తెలుస్తోంది. కొద్దిసేపటికి సింహాలు అక్కడి నుంచి వెళ్లిపోయాయి. ఈ నేపథ్యంలో తమ భద్రతపై ఫ్యాక్టరీలలో పనిచేసే కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.