సరిహద్దుల్లో అనుమానాస్పద హెలికాప్టర్ల చక్కర్లు.. పాక్ పనేనా? - రాజస్థాన్ బాడ్మెర్ జిల్లా
🎬 Watch Now: Feature Video
రాజస్థాన్ బాడ్మేర్ జిల్లాలోని పాకిస్థాన్ సరిహద్దుకు సమీపంలో రెండు హెలికాప్టర్లు చక్కర్లు కొట్టడం కలకలం సృష్టించింది. హెలికాప్టర్ల వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. బాడ్మేర్ జిల్లాలోని సందాని పట్టణం లూనీ నదీ ప్రాంతంలో ఈ చాపర్లు ల్యాండ్ అయి.. ఆ వెంటనే గాల్లోకి ఎగిరినట్లు తెలుస్తోంది. అయితే.. అవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరికి చెందినవి అనే విషయంపై స్పష్టత లేదు. హెలికాప్టర్లు భద్రతా దళాలకు చెందినవా, మరెవరివైనా అయి ఉంటాయా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టినట్లు బాడ్మేర్ జిల్లా అడిషనల్ ఎస్పీ నర్పత్ సింగ్ తెలిపారు.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST