కరెన్సీ నోట్ల వర్షం.. అందుకునేందుకు ఎగబడ్డ జనం.. ఎక్కడంటే? - నోట్ల వర్షం గుజరాత్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 18, 2023, 6:40 PM IST

Updated : Feb 18, 2023, 8:08 PM IST

గుజరాత్​లో ఆకాశం నుంచి నోట్ల వర్షం కురిసింది. గాల్లో ఎగిరిపడుతున్న 100, 200, 500 రూపాయల నోట్లను అందుకునేందుకు స్థానికులు ఎగబడ్డారు. తమ కుమారుడి వివాహం సందర్భంగా ఓ కుటుంబం ఈ పని చేసింది. ఇంటిపై నుంచి నోట్లను వెదజల్లింది. మహేసాణా జిల్లా, కడీ తాలుకాలో ఇటీవల ఈ ఘటన జరిగింది. గడిచిన మూడు రోజుల నుంచి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. డాబాపై ఉన్న ఓ వ్యక్తి రూ.500 నోట్లను గాల్లోకి వెదజల్లుతుండగా.. కింద ఉన్న వారంతా వాటిని అందుకునేందుకు ఎగబడటం వీడియోలో కనిపిస్తోంది. ఒకరినొకరు తోసుకుంటూ నోట్లను అందుకునే ప్రయత్నం చేయడం వీడియోలో రికార్డైంది. మాజీ సర్పంచ్ కరీంభాయి దాదుభాయి జాదవ్ మేనల్లుడు రజక్ వివాహం సందర్భంగా ఈ ఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు. వారి కుటుంబంలో రజక్ ఒక్కడే మగ సంతానం అని, అందుకే ఇలా చేశారని సమాచారం.

Last Updated : Feb 18, 2023, 8:08 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.