ఇళ్ల మధ్యలోకి 14 అడుగుల పైథాన్.. జనం హడల్ - 14 అడుగుల పైథాన్ హల్చల్
🎬 Watch Now: Feature Video
ఉత్తరాఖండ్‌లో ఓ కొండ చిలువ హల్చల్ చేసింది. పైథాన్ గ్రామంలోకి ప్రవేశించడం వల్ల స్థానికులు ఒక్కసారిగా బెదిరిపోయారు. వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే ఫారెస్ట్ అధికారులు ఘటనా స్థలికి చేరుకున్నారు. అప్పుడు ఏం జరిగిందంటే?
ఉధమ్‌సింగ్ నగర్ జిల్లాలోని కాశీపుర్ తాలుకాలోని గోపిపురా అనే గ్రామంలోకి 14 అడుగుల పొడవున్న కొండ చిలువ ప్రవేశించింది. ఈ పైథాన్‌ను చూసి గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించారు. వారు పాములు పట్టే వ్యక్తి తాలిబ్ హుస్సేన్‌ను రప్పించారు. అతడు చాకచక్యంగా వ్యవహరించి భారీ కొండ చిలువను పట్టుకున్నాడు. అటవీ అధికారుల సమక్షంలో కొండచిలువను అడవిలో వదిలిపెట్టాడు. దీంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు. కొండచిలువ 14 అడుగుల పొడవు.. దాదాపు 74 కిలోల బరువు ఉంటుందని తాలిబ్ చెప్పాడు. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ సమీపంలోని గ్రామాల్లో పులులు, సింహాలు, కొండచిలువలు ప్రవేశిస్తున్నాయి. కొన్ని సార్లు కొండచిలువలు గొర్రెలు, మేకలు వంటి మూగజీవులను మింగేస్తున్నాయి.