Punjab Viral Robbery Video : ముసుగు దొంగల బీభత్సం.. పాయింట్ బ్లాంక్ రేంజ్లో గన్.. రూ.లక్షన్నర చోరీ - పంజాబ్ గురుదాస్‌పుర్ ఎస్బీఐ సేవా కేంద్రంలో చోరీ
🎬 Watch Now: Feature Video
Published : Aug 25, 2023, 2:22 PM IST
Punjab Viral Robbery Video : పంజాబ్.. గురుదాస్‌పుర్ జిల్లా భాటియా గ్రామంలోని ఎస్బీఐ సేవా కేంద్రంలో ముగ్గురు ముసుగు దొంగలు బీభత్సం సృష్టించారు. అక్కడ పనిచేస్తున్న వ్యక్తిని పాయింట్ బ్లాంక్ రేంజ్లో గన్‌తో బెదిరించి రూ.1.5 లక్షలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధిచిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.
ఇదీ జరిగింది.. భాటియాకు చెందిన రాజేశ్ అగ్నిహోత్రి అనే వ్యక్తి స్థానికంగా ఎస్బీఐ మనీ ట్రాన్స్ఫర్ సర్వీస్ సెంటర్లో పని చేస్తున్నాడు. అతడు తన కుమారులతో కార్యాలయంలో ఉండగా.. ముగ్గురు వ్యక్తులు ముసుగులు ధరించి లోపలికి దూసుకొచ్చారు. అనంతరం రాజేశ్, అతడి కుమారులను పాయింట్ బ్లాంక్ రేంజ్లో గన్ పెట్టి బెదిరించారు. డబ్బులివ్వాలని వారిపై దాడి చేశారు. రూ. 1.5 లక్షలు దోచుకుని అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలన్నీ సీసీటీవీలో రికార్డయ్యాయి. రాజేశ్.. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. డీఎస్పీ రాజ్బీర్ సింగ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్థానికులు తెలిపిన వివరాలు, సీసీటీవీ ఫుటేజీ అధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు.
TAGGED:
పంజాబ్‌లో మసుగు దొంగలు చోరీ