Washington Sundar Catch Out Controversy : బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో అంపైర్ నిర్ణయం మరోసారి కాంట్రవర్సీకి దారి తీసింది. టీమ్ఇండియా బ్యాటర్ వాషింగ్టన్ సుందర్ ఔట్ పట్ల థర్డ్ అంపైర్ నిర్ణయంపై కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే థర్డ్ అంపైర్ గత మ్యాచ్‌లో ఒకలా, ఈ మ్యాచ్‌లో మరోలాగా వ్యవహరించారంటూ నెటిజన్లు కూడా మండిపడుతున్నారు.
ఇదీ జరిగింది
సిడ్నీ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టాస్ నెగ్గిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ ఇన్నింగ్స్‌లో కమిన్స్ వేసిన 66 ఓవర్లో వాషింగ్టన్ సుందర్ (14 పరుగులు, 30 బంతుల్లో) వివాదాస్పద రీతిలో క్యాచ్ ఔటయ్యాడు. కమిన్స్ వేసిన బంతిని సుందర్ థర్డ్ మ్యాన్ దిశగా ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బ్యాట్‌ను తాకకుండానే బంతి కీపర్ చేతిలో పడింది. దీంతో ఆసీస్ ప్లేయర్లు అప్పీల్ చేశారు. ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇవ్వగా, ఆసీస్ రివ్యూ కోరింది.
థర్డ్ అంపైర్ పలు యాంగిల్స్‌లో బంతిని పరిశీలించాడు. ఆ బంతి సుందర్ గ్లౌవ్‌ను తాకిందా? లేదా అని స్నికో మీటర్ సాయంతో రిప్లైలో పలుమార్లు పరిశీలించాడు. అయితే అది ఓ యాంగిల్లో తాకనట్లు, మరో యాంగింల్లో తాకినట్లు స్నికో మీటర్ స్పైక్ వచ్చింది. దీంతో అంపైర్ అది ఔట్‌గా ప్రకటించాడు. దీంతో నాన్ స్ట్రైకర్‌గా ఉన్న బుమ్రా అసంతృప్తి వ్యక్తం చేశాడు.
JASPRIT BUMRAH IS NOT HAPPY WITH WASHINGTON SUNDAR DECISION:
— Tanuj Singh (@ImTanujSingh) January 3, 2025
- Bumrah saying " last game he didn't give it out on snicko and now this give out".pic.twitter.com/TNl69lFcY5
గత మ్యాచ్‌లో ఒకలా, ఇప్పుడు మరోలా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు బుమ్రా అన్నాడు. 'గత మ్యాచ్‌లో స్నికో మీటర్ ఆధారంగా నిర్ణయం తీసుకోలేదు. ఈ మ్యాచ్‌లో మాత్రం స్నికోలో స్పైక్ వచ్చిందని ఔటిచ్చాడు'అని బుమ్రా అన్న మాటలు స్టంప్ మైక్‌లో రికార్డ్ అయ్యాయి. అయితే మెల్బోర్న్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో యశస్వీ జైస్వాల్ ఔట్ కూడా ఇలాగే వివాదస్పదం అయ్యింది. అప్పుడు స్నికో మీటర్లో స్పైక్ రాకున్నా, బంతి గమనం మారిందని అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే, తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 185 పరుగులకు ఆలౌటైంది. రిషభ్ పంత్ (40 పరుగులు) టాప్ స్కోరర్. ఆసీస్ బౌలర్లలో స్కాట్ బొలాండ్ 4, మిచెల్ స్టార్క్ 3, కమిన్స్ 2, లియాన్ 1 వికెట్ దక్కించుకున్నారు. మరోవైపు ఆసీస్ 9-1తో కొనసాగుతోంది.
'కొన్‌స్టాస్‌ను ఓసారి భారత్‌కు తీసుకురండి, చూపిద్దాం మనమేంటో!'- మాజీ క్రికెటర్
'రెస్ట్ పేరు చెప్పి రోహిత్‌ను కావాలనే తప్పించారు - ఏ కెప్టెన్ కూడా ఇలా చేయడు'