LIVE : హెచ్‌ఐసీసీలో ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభల ప్రారంభం - ప్రత్యక్షప్రసారం - WORLD TELUGU CONFERENCE LIVE
🎬 Watch Now: Feature Video
Published : Jan 3, 2025, 5:37 PM IST
|Updated : Jan 3, 2025, 6:44 PM IST
world Telugu Conference in Hyderabad Live : హైదరాబాద్ హెచ్‌ఐసీసీలో ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తెలుగు భాష ప్రాముఖ్యత., సంస్కృతి విశేషాలతో పాటు పలు రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ మహాసభల ప్రారంభ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. కార్యక్రమానికి పలువురు భాషాభిమానులు, తెలుగు ప్రముఖులు, రాజకీయ నాయకులు, సినీకళాకారులు, సాహితీ వేత్తలు, వ్యాపార ప్రముఖులు హాజరయ్యారు. 1992లో ప్రారంభమైన ప్రపంచ తెలుగు సమాఖ్య రెండేళ్లకోసారి మహాసభలు నిర్వహిస్తున్నట్లు వేడుకలను నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు సమాఖ్య అధ్యక్షురాలు ఇందిరాదత్ తెలిపారు. హైదరాబాద్‌లో ఈ మహాసభలు జరగడం ఇది రెండోసారి. హెచ్‌ఐసీసీలో జరుగుతున్న వేడుకలకు హాజరైన ఏపీ సీఎం చంద్రబాబు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. ఆయనతోపాటు కృష్ణ ఎల్ల, మురళీమోహన్, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి, కంభంపాటి హాజరయ్యారు. హెచ్‌ఐసీసీలో ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభల వేడుకను ఇప్పుడు ప్రత్యక్ష్యంగా చూద్దాం.
Last Updated : Jan 3, 2025, 6:44 PM IST