ETV Bharat / state

వైభవంగా కొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాలు - భారీగా తరలివచ్చిన భక్తులు - KOMURAVELLI MALLANNA TEMPLE

కొమురవెల్లిలో ఘనంగా ప్రారంభమైన మల్లన్న బ్రహ్మోత్సవాలు - ప్రతి ఏటా సంక్రాంతి పండగ తర్వాత వచ్చే మొదటి ఆదివారం ఆనవాయితీగా జరుగుతున్న ఉత్సవాలు - రెండున్నర నెలల పాటు జరుగనున్న జాతర

MALLANNA BRAHMOTSAVAM
KOMURAVELLI MALLIKARJUNA SWAMY TEMPLE (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 20, 2025, 9:44 PM IST

Komuravelli Mallikarjuna Swamy Temple : సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లిలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం (జనవరి 19) వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏటా సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే మొదటి ఆదివారం రోజున ఈ ఉత్సవాలను జరపడం ఆనవాయితీగా వస్తుంది. జనవరి 19 మొదలైన ఈ ఉత్సవాలు దాదాపు రెండున్నర నెలల పాటు జరుగనున్నాయి. ఉగాది పండగకు ముందు వచ్చే ఆదివారం రోజు అర్ధరాత్రి తర్వాత నిర్వహించే అగ్నిగుండం కార్యక్రమంతో ఈ బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

అద్భుతంగా పట్నం వారం : ఈ బ్రహ్మోత్సవాల్లో మొదటి వారాన్ని 'పట్నం వారం'గా పిలుస్తారు. శనివారం (జనవరి 18న) సాయంత్రమే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మల్లికార్జునస్వామిని ధూళి దర్శనం చేసుకున్నారు. ఆదివారం నైవేద్యం వండి, పాత్రలను సుందరంగా అలంకరించి, పూనకాలతో ఊగిపోతూ ఆ దైవం మల్లన్నకు, గుట్టపై ఉన్న రేణుకా ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. ఆదివారం ఒక్క రోజే సుమారు 70 వేల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారని ఆలయ ఎండోమెంట్ ఆఫీసర్ రామాంజనేయులు తెలిపారు. సోమవారం (జనవరి 20న) ‘పట్నం-అగ్నిగుండం’ కార్యక్రమాలను హైదరాబాద్‌ భక్తులు సొంత ఖర్చులతో నిర్వహిస్తున్నారు.

ప్రతి ఆదివారం విశేష కార్యక్రమం : కొమురవెల్లి మల్లన్న ఆలయంలో ప్రతి ఆదివారం విశేషమైన కార్యక్రమాలు నిర్వహిస్తారు. దీంతో ఆదివారం రోజున భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. భక్తులు బోనాలతో సంతోషంగా ఆలయానికి వెళ్లి మల్లికార్జున స్వామి, అమ్మవార్లకు నైవేద్యం సమర్పిస్తారు. పట్నం వేసి కల్యాణం జరిపించి తమ మొక్కులను తీర్చుకుంటారు. తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు.

భక్తుల కోసం ఆలయ పరిసరాల్లో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాజగోపురం పక్కన భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటుచేశారు. భక్తులకు సూర్యకాంతి తగలకుండా వాటిపై చలువ పందిళ్లు వేయించారు. కొత్తగా నిర్మించిన ప్రసాదాల విక్రయ కేంద్రం, ఆర్జిత సేవల రసీదులు అందజేత సెంటర్​ వద్ద పక్కా క్యూలైన్లు ఏర్పాటు చేశారు.

కోలాహలంగా కొమురవెల్లి మల్లన్న పెద్దపట్నం - శివనామస్మరణతో మార్మోగిన పరిసరాలు

వైభవంగా ప్రారంభమైన కొమురవెల్లి మల్లన్న జాతర - మొక్కులు చెల్లించుకున్న భక్తులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.