Prathidwani : ప్రమాదంలో పత్రికా స్వేచ్ఛ.. ప్రశ్నించే గొంతునే అణచివేస్తున్న ప్రభుత్వాలు
🎬 Watch Now: Feature Video
Prathidwani : ఒకవైపు చట్టాలతో అడ్డుగోడలు.. మరోవైపు అమానుష దాడులు, అణచివేతలు. ప్రమాదంలో పడిన పత్రికాస్వేచ్ఛ ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితి ఇది. ప్రజాస్వామ్య పునాదుల్లో అత్యంత కీలకమైన మీడియా స్వేచ్ఛ విషయంలో అంతర్జాతీయ సూచీల్లో ఏటికేటా కిందకు జారిపోతున్న ఇండియా ర్యాంకే అందుకు నిదర్శనం. 180 దేశాలకు గానూ.. 161వ స్థానంలో పత్రికా స్వేచ్ఛలో భారత్ ఉందంటే దేని కొలమానం. స.హ. సవరణలు, ఐటీ నిబంధనలు వీటి గురించి ఏం చెబుతున్నాయి? వ్యతిరేక వార్తలు రాస్తే కేసుల పెడతామంటూ బెదిరింపులకు పాల్పడుతూ.. ప్రశ్నించే గొంతులు లేకుండా చేయడమే ఈ చట్టాల లక్ష్యమా? అసలు.. డేటా ప్రైవసీ బిల్లు వల్ల దేశంలో పత్రికా స్వేచ్ఛకు ఏర్పడుతున్న ప్రమాదం ఏమిటి?
హక్కుల్ని పరిరక్షించాల్సిన చట్టాలతోనే సంకెళ్లు వేస్తున్నారన్న ఆందోళనలు ఎందుకు పెరుగుతున్నాయి? జర్నలిస్టులపై, గిట్టని పత్రికల యాజమాన్యాలపై కక్ష ప్రభుత్వాల తీరుతో ఎలాంటి అనర్థాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది? ఈ పోకడలు అత్యంత ప్రమాదకరం అంటున్న నిపుణులతో ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.