రోడ్లు లేక.. ప్రసవం కోసం 4 కిలోమీటర్లు డోలీలోనే..! - palghar pregenent video viral
🎬 Watch Now: Feature Video
Pregnant women Doli: రోడ్డు సౌకర్యం లేక నిండు గర్భిణీని ప్రసవం కోసం నాలుగు కిలోమీటర్ల దూరం.. డోలీలో మోసుకువెళ్లిన ఘటన మహారాష్ట్రలో జరిగింది. పాల్ఘర్ జిల్లాలోని ముకుందపాద అనే గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదు. తాలూకా కేంద్రానికి సైతం ఆ గ్రామం 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రోడ్డుసౌకర్యం లేకపోవటం, ఆరోగ్య కేంద్రం సైతం అందుబాటులో లేకపోవడం వల్ల ముకుందపాద గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామానికి చెందిన ఓ గర్భిణీకి పురిటినొప్పులు రావడం వల్ల రోడ్డుపైకి చేరటానికి మహిళ కుటుంబసభ్యులు దాదాపు నాలుగు కిలోమీటర్లు డోలీలో మోసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అనంతరం అక్కడినుంచి రోడ్డుమార్గంలో ఆస్పత్రికి తరలించారు. ఇప్పటికైనా తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని ముకుందపాద గ్రామస్థులు కోరుతున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST