Pratidhwani: ఐటీ కొలువుల కోతలకు ప్రధాన కారణాలు - ఏపీలో ఉద్యోగుల తొలగింపు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 20, 2023, 8:40 PM IST

 యాక్సెంచర్‌లో 19వేల మంది.. గూగుల్‌లో 12వేల మంది.. మెటాలో పదివేలు.. మెక్రోసాఫ్ట్‌లో 10 వేలమంది. ప్రపంచవ్యాప్తంగా ఐటీరంగంలో కొలువుల కోత సృష్టిస్తున్న ప్రకంపనలు ఇవి. గడిచిన ఆర్ధికసంవత్సరం ప్రారంభం నుంచీ తీసుకుంటే ఈ లెక్కలు మరింత భారీగా భయ పెడుతున్నాయి. ఒక్క ఆమెజాన్‌లోనే... 27వేలమందికిపైగా పింక్‌స్లిప్స్‌ ఇచ్చారు. ఆకర్షణీయమైన జీతాలు, హై ఫై జీవితాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అనుకునే ఐటీలో ఈ స్థాయిలో ఉద్యోగాల తీసివేతలకు కారణం ఏమిటి? ఈ ఏడాది తొలి త్రైమాసికంలోనే రెండు లక్షల వరకు ఐటీ ఉద్యోగాలు పోవడం దేనికి సంకేతం? మాంద్యం భయాలు మధ్య తాత్కాలికంగా ఖర్చులు తగ్గించుకోవాలన్న సంస్థల ఆలోచనలే ఈ కోతలకు కారణమా? లేక AI, ఆటోమేషన్ విప్లవంతో ఉద్యోగవిపణి ముఖచిత్రమే మారుతోందా?  ఈ పరిస్థితి ఎంత కాలం కొనసాగవచ్చు? ఐటీ ఉద్యోగులు, ఆ దిశగా కోటి ఆశలతో ఎదురుచూస్తున్న ఫ్రెషర్స్ ముందు ఇప్పుడున్న మార్గం ఏమిటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని కార్యక్రమం.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.