Prathidwani: భవిష్యత్లో కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం ఎలా ఉంటుంది..? - ఐదు రాష్ట్రాల ఎన్నికలపై కర్ణాటక ఎన్నికల ప్రభావం
🎬 Watch Now: Feature Video
Prathidwani: స్వల్ప వ్యవధిలోనే... అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. కాలం కలసి వస్తే వాటికి జమ్మూ కశ్మీర్ రూపంలో మరో రాష్ట్రం కూడా జత కలవచ్చు. అవి కాగానే... అసలైన 2024 సార్వత్రిక ఎన్నికల సమరం. సరిగ్గా ఇలాంటి కీలకమైన సమయంలో కర్ణాటక ఎన్నికల ఫలితాలు వచ్చాయి. షెడ్యూల్ ప్రకటన నుంచే దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించిన ఈ చావో రేవోలో అధికార భాజపాపై ఊహించని రీతిలో తిరుగు లేని ఆధిపత్యం చెలాయించింది కురు వృద్ధ కాంగ్రెస్. అవసాన దశకు చేరుకుందని అనుకున్న పరిస్థితుల్లో హస్తం పార్టీకి కొత్త ఊపిరి ఇచ్చాయి ఈ కర్ణాటక ఎన్నికల ఫలితాలు. మరి ఈ ఫలితాలు భవిష్యత్ రాజకీయ ముఖచిత్రంపై ఎలాంటి ప్రభావం చూపించనున్నాయి ? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చ చేపట్టింది. సీనియర్ రాజకీయ విశ్లేషకులు టి. లక్ష్మీనారాయణ, సీనియర్ పాత్రికేయులు రాకా సుధాకర రావు ప్రతిధ్వని చర్చలో పాల్గొని తమ అభిప్రాయాలు వెల్లడించారు.