Prathidhwani: పులి-మేక తరహాలో సాగుతున్న అవినాష్ అరెస్ట్ - వైసీపీ నేత అరెస్ట్
🎬 Watch Now: Feature Video
Prathidhwani: అవినాష్ అరెస్టుపై ఎన్నో అంతులేని ప్రశ్నలు. సీబీఐ తనను అరెస్ట్ చేయాలని చూస్తోందని అంటున్నారు వైసీపీ ఎంపీ వై.ఎస్. అవినాష్ రెడ్డి. సీబీఐ కూడా తాము అరెస్టు చేసి ప్రశ్నిస్తామని అంటోంది. ఇప్పటి వరకు కోర్టులు కూడా అరెస్టును అడ్డుకోలేమనే చెబుతూ వచ్చాయి. సమస్య ఎక్కడుంది మరి? న్యాయపరంగా ఎలాంటి అడ్డంకులు లేకపోయినా... సీబీఐ ఎందుకు అరెస్ట్ చేయలేదు? అరెస్ట్ చేయవద్దని ఎవరైనా చెప్పారా? ఈ దాగుడుమూతలు ఎంతకాలం? పులి-మేక తరహాలో సాగుతున్న అవినాష్ అరెస్ట్ వ్యవహారంలో తలెత్తే ప్రశ్నలకు సమాధానం ఎప్పుడు?
అరెస్ట్ కు సహకరించకపోతే బలగాలను దింపాలి కదా? ఆ పని ఎందుకు చేయలేదు? సీఎం జగన్ పేరును సీబీఐ ప్రస్తావించడాన్ని ఒక కుట్రగా సజ్జల రామకృష్ణారెడ్డి గానీ, వాళ్ల మీడియా గానీ పేర్కొంటున్నారు. సీఎం జగన్‌కు ఈ కేసుతో ఉన్న లింకేంటి? అవినాష్‌ను అరెస్ట్ చేసి ప్రశ్నిస్తే జగన్‌కు ఎవరు సమాచారం ఇచ్చారో తెలుస్తుందా? ఇంకా ఏ ఏ అంశాలు బయటకు రావొచ్చని మీరు భావిస్తున్నారు? అవినాష్ ఫోన్ ఎందుకుస్వాధీనం చేసుకోలేదని ప్రశ్నించింది. హైకోర్టు మాంత్రికుడి ప్రాణం చిలకలో ఉన్నట్లు ఈ కేసు గుట్టు ఆయన ఫోన్‌లో ఉందా? ఇదీ నేటి ప్రతిధ్వని.