పెళ్లి కూతురికి సర్ప్రైజ్ ఇచ్చిన వరుడు.. హెలికాప్టర్లో ఏడు రౌండ్ల చక్కర్లు
🎬 Watch Now: Feature Video
పెళ్లి కూతురికి వరుడు సూపర్ సర్ప్రైజ్ ఇచ్చాడు. పెళ్లి అనంతరం నేరుగా భార్యతో కలిసి హెలికాప్టర్ ఎక్కాడు. ఏడు రౌండ్ల పాటు గాలిలో చక్కర్లు కొట్టాడు. ఏడుజన్మలు కలిసుంటానని భార్యకు ప్రమాణం చేశాడు. ఆ తరువాత పెళ్లి కూతురితో కలిసి హెలికాప్టర్లోనే ఇంటికెళ్లాడు. దీంతో వరుడి కుటుంబ సభ్యులందరూ ఆశ్చర్యానికి గురై.. ఆనందం వ్యక్తం చేశారు. కాగా వధూవరులిద్దరూ పైలెట్లే కావడం గమనార్హం. ఉత్తర్‌ప్రదేశ్‌కు బులంద్‌షహర్ జిల్లాకు చెందిన లోకేంద్ర ప్రతాప్.. మేరఠ్ జిల్లాకు యషాంసీ రాణాని పెళ్లి చేసుకున్నాడు. బుధవారం రాత్రి వీరి వివాహం ఘనంగా జరిగింది. లోకేంద్ర ప్రతాప్ ఆస్ట్రేలియాలో పైలట్ కాగా.. యషాంసీ రాణా కమర్షియల్ పైలట్‌గా పనిచేస్తోంది.