లక్ష మందితో భగవద్గీత పారాయణం- శ్లోకాలతో మార్మోగిన పరేడ్ గ్రౌండ్స్- గిన్నిస్ రికార్డు పక్కా! - లక్ష మంది కలిసి భగవద్గీత పఠనం
🎬 Watch Now: Feature Video
By PTI
Published : Dec 24, 2023, 5:07 PM IST
One Lakh People Chant Bhagavad Gita in Kolkata : బంగాల్లో సుమారు లక్ష మంది ప్రజలు కలిసి భగవద్గీత శ్లోకాలు పఠించారు. వివిధ వర్గాలకు చెందిన ప్రజలు కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్‌లో గీతా పారాయణం చేశారు. యువత నుంచి పెద్దవారి వరకు అంతా సంప్రదాయ దుస్తులు ధరించి భగవద్గీత పఠించారు. అనేక మంది మునులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రజలతో శ్లోకాలు చదివించారు. దీంతో కార్యక్రమం జరిగిన ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. పరిసరాలన్నీ గీతా శ్లోకాలతో మార్మోగిపోయాయి.
సుమారు లక్షా 20 వేల మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు పేర్లు నమోదు చేసుకున్నారని నిర్వాహకులు తెలిపారు. ఒకే చోట అత్యధిక మంది గీతా పారాయణం చేసిన కార్యక్రమంగా దీనికి గిన్నిస్ రికార్డు లభించే అవకాశం ఉందని చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉన్నప్పటికీ పలు కారణాల వల్ల ఆయన రాలేకపోయారని బీజేపీ వర్గాలు తెలిపాయి. బంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్, ఆ రాష్ట్ర విపక్ష నేత సువేందు అధికారి సహా కీలక ఆర్ఎస్ఎస్ నాయకులు సైతం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని భగవద్గీత పారాయణం చేయడం వల్ల సామాజిక సామరస్యం పెంపొందడమే కాకుండా దేశ అభివృద్ధి ప్రయాణానికి సరికొత్త శక్తి లభిస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. జీవితంలో ఎదురయ్యే అనేక సవాళ్లకు గీత పరిష్కారం చూపిస్తుందని అన్నారు. ఈ మేరకు కార్యక్రమానికి ఆయన సందేశం పంపించారు.
'అయోధ్య ప్రాణప్రతిష్ఠకు 84 సెకన్ల అద్భుత ముహూర్తం- ఆ గడియల్లో పూర్తిచేస్తే తిరుగుండదు'
అయోధ్య రామయ్య కోసం పట్టు వస్త్రం- మగ్గంపై నేస్తున్న లక్షలాది మంది భక్తులు- ఎక్కడో తెలుసా?